విషాదం: కుక్కల దాడి.. వాఘ్ బక్రీ టీ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పరాగ్ దేశాయ్ కన్నుమూత
న్యూఢిల్లీ: ప్రముఖ వ్యాపారవేత్త, వాఘ్ బక్రీ (Wagh Bakri) టీ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పరాగ్ దేశాయ్ (Parag Desai) 49 ఏళ్ల వయస్సులోనే కన్నుమూశారు. మెదడులో రక్తస్రావం కారణంగా ఆదివారం ఆయన మరణించినట్లు కంపెనీ ఓ ప్రకటనలో సోమవారం వెల్లడించింది. వారం క్రితం ఆయన ఇంటికి సమీపంలో కిందపడటంతో తలకు గాయమైనట్లు సన్నిహితులు తెలిపారు.
వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అయితే, మెదడులో రక్తస్రావం కావడంతో దేశాయ్ కన్నుమూసినట్లు వెల్లడించారు. కాగా, ఇంటికి సమీపంలో వీధి కుక్కలు (Street dogs) దాడి చేయడంతోనే పరాగ్ దేశాయ్ కిందపడినట్లు సన్నిహిత వర్గాలు తెలిపినట్లు పలు మీడియా కథనాలు వెల్లడించాయి.

కుక్కల దాడి విషయం భద్రతా సిబ్బంది నుంచి కుటుబసభ్యులు తెలుసుకుని ఆయన్ని వెంటనే ఆస్పత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. పరాగ్ దేశాయ్ మృతి పట్ల కాంగ్రెస్ ఎంపీ శక్తి సిన్హా గోహిల్ విచారం వ్యక్తం చేశారు. ఆయన ఆత్మహత్యకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. పలువురు పారిశ్రామికవేత్తలు కూడా ఆయన మృతి పట్ల సంతాపం తెలియజేశారు.
ాకగా, వాఘ్ బక్రీ గ్రూప్ ఇద్దరు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లలో పరాగ్ దేశాయ్ ఒకరు. కంపెనీని ఈ-కామర్స్‌లోకి తీసుకెళ్లడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. కంపెనీ సేల్స్, మార్కెటింగ్, ఎక్స్‌పోర్ట్, విభాగాల కార్యకలాపాలను పరాగ్ పర్యవేక్షించారు. ఆయన అమెరికాలో ఎంబీఏ పూర్తి చేశారు. కాగా, వాగ్ బక్రీ గ్రూప్ 1892లో నరన్ దాస్ దేశాయ్ ప్రారంభించారు. ఈ కంపెనీ ప్రస్తుత టర్నోవర్ రూ. 2 వేల కోట్లుగా ఉంది. దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ వాఘ్ బక్రీ విక్రయాలు జరుగుతున్నాయి.












Click it and Unblock the Notifications