ఎయిరిండియా క్రాష్ లో బిగ్ ట్విస్ట్..! ఫ్యూయల్ స్విచ్ ఆఫ్ చేసింది కెప్టెనే ?
గత నెలలో అహ్మదాబాద్ నుంచి లండన్ బయలుదేరిన ఎయిర్ ఇండియా బోయింగ్ విమానం ఏఐ 171 ఐదు నిమిషాల్లోనే కుప్పకూలడానికి వెనుక ఉన్న కారణాలపై మరో సంచలన కథనం బయటికి వచ్చింది. అమెరికాకు చెందిన వాల్ స్ట్రీట్ జర్నల్ ప్రచురించిన ఈ కథనం ఇప్పుడు అందరికీ షాకిచ్చేలా ఉంది. అసలు ఈ ప్రమాదం జరగడానికి కారణమని భావిస్తున్న ఫ్యూయల్ స్విచ్ ఆఫ్ చేసిందెవరో ఈ కథనంలో పరోక్షంగా వెల్లడించింది.
వాల్ స్ట్రీట్ జర్నల్ తన కథనంలో ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ తర్వాత దీన్ని నడుపుతున్న ఫస్ట్ ఆఫీసర్ క్లైవ్ కుందర్ ఫ్యూయల్ స్విచ్ ఆఫ్ చేసి ఉండటాన్ని గమనించి కెప్టెన్ ను ఎందుకు దీన్ని ఆఫ్ చేశారని అడగగా.. ఆయన మౌనంగా ఉన్నట్లు పేర్కొంది. ఫస్ట్ ఆఫీసర్ (జూనియర్ పైలట్) ఈ పరిణామంతో తీవ్ర ఆందోళనకు గురై మేడే కాల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటికే బారత్ లో విమాన ప్రమాదాలపై దర్యాప్తు చేస్తున్న కమిటీ నివేదికలో ఏ పైలట్ ఈ ప్రశ్న వేశారన్నది చెప్పలేదు. అలాగే స్విచ్ ఎందుకు ఆఫ్ చేశారన్న ప్రశ్నకు మరో పైలట్ తాను ఆఫ్ చేయలేదని చెప్పినట్లు పేర్కొంది. కానీ అది నిజం కాదని వాల్ స్ట్రీట్ రిపోర్ట్ బట్టి తెలుస్తోంది.

భారత్ లో ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (ఏఐఐబీ) ప్రాథమిక నివేదికపై స్పందిస్తూ.. వాల్ స్ట్రీట్ జర్నల్ .. ఇది రెండు ఇంజిన్‌లకు ఇంధన కటాఫ్ స్విచ్‌లను ఒకదాని తర్వాత ఒకటి, సెకను వ్యవధిలో లిఫ్ట్ ఆఫ్ అయిన కొద్ది క్షణాల్లోనే కటాఫ్ స్థానానికి మార్చారని తెలిపింది. టేకాఫ్, క్రాష్ మధ్య సమయం కేవలం 32 సెకన్లు మాత్రమే అని కూడా ఇది వెల్లడించింది. ప్రాథమిక నివేదికలోని వివరాలు స్విచ్‌లను ఆఫ్ చేసింది పైలట్ కెప్టెన్ సుమీత్ సభర్వాల్ అని సూచిస్తున్నాయని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న పైలట్లు, ఇతర వ్యక్తులతో మాట్లాడినప్పుడు తెలిసిందని వెల్లడించింది. అలాగే స్విచ్‌లను ఆఫ్ చేయడం ప్రమాదవశాత్తు జరిగిందా లేదా ఉద్దేశపూర్వకంగా జరిగిందా అని నివేదిక చెప్పలేదని వాల్ స్ట్రీట్ జర్నల్ తెలిపింది.

మరోవైపు ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై వాల్ స్ట్రీట్ జర్నల్ కథనాన్ని ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో తీవ్రంగా తప్పుబట్టింది. ఈ ప్రమాదం గురించి ఎంపిక చేసిన, ధృవీకరించని, బాధ్యతారాహిత్యంతో కూడిన నివేదికను అంతర్జాతీయ మీడియా వ్యాప్తి చేస్తోందని విమర్శించింది. భారతీయ విమానయాన సంస్థల భద్రత గురించి ఇది ఆందోళన రేపేలా ఉందని తెలిపింది. ఏఏఐబీ ప్రాథమిక నివేదికపై వాల్ స్ట్రీట్ జర్నల్ కాక్‌పిట్ వాయిస్ రికార్డర్ నుండి వచ్చిన ఆడియో సీనియర్ పైలట్ కెప్టెన్ సుమీత్ సభర్వాల్ ఇంజిన్లకు ఇంధనాన్ని తగ్గించి, గాలిలో థ్రస్ట్ కోల్పోయి క్రాష్‌కు కారణమైనట్లు తెలిపింది.
-
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్












Click it and Unblock the Notifications