ఇక ఫేస్‌బుక్‌ ఖాతాకూ.. ఆధార్‌? నకిలీ ఖాతాల ఏరివేత కోసమేనా?

న్యూఢిల్లీ: పాన్‌ కార్డు, బ్యాంకు ఖాతా, మొబైల్‌ నంబర్‌ ఇలా ప్రతిదానికీ ఆధార్‌ తప్పనిసరి చేసిన సంగతి తెలిసిందే. ఇకపై ఫేస్‌బుక్‌ ఖాతా తెరవాలన్నా ఆధార్‌ కావాలా? అవుననే అంటోంది ఫేస్‌బుక్‌.

అయితే కంగారు పడాల్సిన పనేం లేదు. ఫేస్‌బుక్‌ అడుగుతోంది కేవలం ఆధార్‌ కార్డులో ఉన్న పేరు మాత్రమే. అది కూడా కొందరికి మాత్రమేనని, తప్పనిసరేం కాదని అంటోంది ఈ సోషల్‌మీడియా దిగ్గజం.

Want to open a Facebook account? Keep your Aadhaar card by your side

ప్రస్తుతం ఆధార్‌ విషయంలో పలు భయాలు నెలకొన్న నేపథ్యంలో ఫేస్‌బుక్‌ తాజా చర్య విమర్శలకు తావిస్తోంది. మరోవైపు నకిలీ ఖాతాల ఏరివేతకు ఫేస్‌బుక్‌కు ఇది ప్రత్యామ్నాయంగా ఉపయోగపడుతుందని భావిస్తోంది.

ఫేస్‌బుక్‌లో నకిలీ ఖాతాలకు కొదవే లేదు. అసలు పేరు ఉన్నప్పటికీ వేర్వేరు పేర్లతో చలామణీ అవుతున్నవారి సంఖ్య కోకొల్లలు. అందుకే ఫేస్‌బుక్‌లో కొత్తగా ఖాతా తెరవాలనుకునే వారికి ఆధార్‌ కార్డుపై ఉండే పేరును అడుగుతోంది.

దానిపై ఉన్న పేరును ఇవ్వడం ద్వారా మీ స్నేహితులు, బంధువులు మిమ్మల్ని గుర్తించడం సులభమవుతుందని ఫేస్‌బుక్‌ చెబుతోంది అయితే, ఇది అందరికీ కనిపించడం లేదు. కేవలం మొబైల్‌ సైట్‌లో ఎవరైతే కొత్తగా ఫేస్‌బుక్‌ ఖాతా తెరవాలనుకుంటున్నారో వారిని మాత్రమే ఇలా అడుగుతోంది.

ఇది కేవలం ఐచ్ఛికం మాత్రమేనని, ఆధార్‌ కార్డుపై ఉన్న పేరు కూడా తప్పనిసరి కాదని ఫేస్‌బుక్‌ చెబుతోంది. అయితే, ఇక్కడ ఆధార్‌ కార్డుపై ఉన్న పేరు మాత్రమే ఫేస్‌బుక్‌ అడుగుతోంది కాబట్టి మన వ్యక్తిగత సమాచారానికి ఎలాంటి భయమూ అవసరం లేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+