వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారత్‌పై యుద్ధానికి చైనా దూకుడు, కానీ అవి బ్రేకులు వేస్తాయి!

భారత్ - చైనా సరిహద్దులో ఉద్రిక్తతలు గత రెండు నెలలకు పైగా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఉద్రిక్తతలు తీవ్రమై యుద్ధానికి దారి తీసినా చైనాకు ఒరిగేదేమీ లేదని,

|
Google Oneindia TeluguNews

బీజింగ్: భారత్ - చైనా సరిహద్దులో ఉద్రిక్తతలు గత రెండు నెలలకు పైగా కొనసాగుతున్నాయి.

భారత్ - చైనా సరిహద్దులో ఉద్రిక్తత: వ్యూహాత్మక రోడ్లపై కదలికభారత్ - చైనా సరిహద్దులో ఉద్రిక్తత: వ్యూహాత్మక రోడ్లపై కదలిక

ఈ నేపథ్యంలో ఉద్రిక్తతలు తీవ్రమై యుద్ధానికి దారి తీసినా చైనాకు ఒరిగేదేమీ లేదని, ఇరు వైపులా ప్రాణ నష్టం మినహా సాధించేదేమీ లేదని ప్రభుత్వం అంచనా వేస్తోంది.

చైనా హెచ్చరికలు కట్టిపెట్టి

చైనా హెచ్చరికలు కట్టిపెట్టి

చైనా భేషజాలకు పోయి హెచ్చరికలు జారీ చేయడం కట్టిపెట్టి చర్చల ద్వారా సమస్యల పరిష్కారానికి చొరవ చూపడమే మేలని ప్రభుత్వం భావిస్తోంది.

భారత్ బెదరబోదు

భారత్ బెదరబోదు

1962లో చైనాతో తలపడిన భారత్ తాజా ఉద్రిక్తతలకు బెదరబోదని, ఆసియా ప్రబల శక్తిగా ఎదిగి అమెరికాకు దీటైన సవాల్ విసురుతున్న చైనాకే యుద్ధంతో సవాళ్లు ఎదురవుతాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

బలం ఇలా

బలం ఇలా

భారత్ - చైనా సరిహద్దు ప్రాంతంలో డొక్లామ్ వద్ద భారత్‌కే ప్రాబల్యం ఉందని, సైన్యం పరంగా మనమే ముందున్నామని, అయితే సరిహద్దులో మౌలిక వసతుల విషయంలో చైనాదే పైచేయి అని చెబుతున్నారు.

చైనా దూకుడుకు ఇవి బ్రేకులు

చైనా దూకుడుకు ఇవి బ్రేకులు

యుద్ధం వస్తే 3,488 కిలో మీటర్ల ఇండో - చైనా సరిహద్దు వెలుపలకూ అది విస్తరించే అవకాశాలు లేకపోలేదని ఆందోళన వ్యక్తమవుతోంది. భారత్ - చైనాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం ఊపందుకున్న క్రమంలో ఉద్రిక్తతలు యుద్ధానికి దారి తీసే పరిస్థితి ఉండబోదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. యుద్ధం దిశగా అడుగు వేస్తున్న చైనా దూకుడుకు ఆర్థిక, వ్యూహాత్మక అంశాలు బ్రేక్ వేస్తాయని అంటున్నారు.

English summary
Escalation of the Doklam stand off into a shooting war is unlikely to deliver significant gains for China, and a wider conflict carries the risk of heavy casualties tilting the odds in favour of diplomacy prevailing despite a barrage of angry words from Beijing.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X