బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

1996 తరువాత బెంగళూరు నగరంలో 37 డిగ్రీల సెల్సియస్, ఎండలకు హడలిపోతున్న నగర ప్రజలు !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: బెంగళూరు నగరంలో 22 సంత్సరాల తరువాత ఎండలకు ప్రజలు విలవిలలాడిపోతున్నారు. బెంగళూరు నగరంలో 22 ఏళ్ల తరువాత ఎన్నడూ లేనంత మార్చిలో 37 డిగ్రీల సెల్సియస్ నమోదు అయ్యింది. చలికాలం పూర్తి కాకముందే మార్చి నెలలో 37 డిగ్రీల సెల్సియస్ నమోదు కావడంతో బెంగళూరు నగర ప్రజలు హడలిపోయారు.

సామాన్యంగా ఏప్రిల్, మే నెలలో వేసవి కాలం మొదలౌతుంది. అయితే ఈ సంవత్సరం ఫిబ్రవరి నెల నుంచే బెంగళూరు నగరంలో ఎండలు మండిపోతున్నాయి. మార్చి మొదటి వారంలో గరిష్టంగా 37 డిగ్రీల సెల్సియస్ దాటిపోయింది.

Warm days ahed for Bengaluru in Karnataka

2017 మార్చి 26వ తేదీ 37.2 డిగ్రీల సెల్సియస్ నమోదు అయ్యింది. 2009 తరువాత మార్చిలో ఇంత ఎక్కువ ఉష్టోగ్రత నమోదు కాలేదని వాతావరణ శాఖ అధికారులు అంటున్నారు. శుక్రవారం నుంచి రెండు నుంచి మూడు డిగ్రీల ఉష్ణోగ్రత తగ్గే అవకాశం ఉందని వాతవరణ శాఖ అధికారులు తెలిపారు.

బెంగళూరు నగరంలో ఒక్కవారం నుంచి 34 నుంచి 35 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అవుతున్నదని వాతావరణ శాఖ అధికారులు అంటున్నారు. ఆంధ్రప్రదేశ్, తమిళనాడులో వేడిగాలులు బలంగా వీస్తున్నాయని, వాటి ప్రభావం కర్ణాటక మీద పడుతున్నదని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

బెంగళూరు నగరంలో కనీష్ణంగా 20.5 డిగ్రీల సెల్సియస్, గరిష్టంగా 37 డిగ్రీల సెల్సియస్, కేఐఎఎల్ లో కనిష్టంగా 18.5 డిగ్రీల సెల్సియస్, గరిష్టంగా 36.4 సెల్సియస్, హెచ్ఎఎల్ లో కనిష్టంగా 21.3 డిగ్రీల సెల్సియస్, గరిష్టంగా 36 డిగ్రీల సెల్సియస్ ఉష్టోగ్రత నమోదు అవుతుందని వాతావరణ శాఖ అధికారులు అంటున్నారు. మొత్తం మీద బెంగళూరు నగరంలో వృద్దులు, చిన్నారులు ఇంటి నుంచి బయటకు రావాలంటే హడలిపోతున్నారు.

English summary
The city wilted under a harsh sun on Thursday the first day of summer seeing a near record temperature of 37°C for March. in 1996.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X