వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

డ్రైనేజీలు, లావేట్రీలు క్లీన్ చేసేందుకు ఎంపీ అయ్యానా...! బీజేపీ ఎంపీ

|
Google Oneindia TeluguNews

మాలేగావ్ పేలుళ్ల నిందితురాలు, బోపాల్ బీజేపీ ఎంపీ సాధ్వీ ప్రాగ్యా సింగ్ టాగూర్ మరో వివాదంలో చిక్కుకున్నారు. ఇటివల ఎన్నికల్లో మొదటి సారిగా ఎంపికైన సాధ్వి ఎన్నికల సమయంలో ఆనేక వివాదాలకు వేదికయ్యారు. ఇప్పడు తాజాగా తన నియోజకవర్గ పర్యటనలో ఆమే చేసిన వ్యాఖ్యలు వివాదస్పదమయ్యాయి.డ్రైనేజీలు, లావేట్రీలు క్లీన్ చేసేందుకు ఎంపీ కాలేదని మరోసారి వార్తోల్లోకి ఎక్కారు.

మధ్యప్రదేశ్‌ రాష్ట్రం భోపాల్ ఎంపీగా ఎన్నికైన బీజేపీ నేత సాధ్వీ ఇటివల తన నియోజకవర్గంలో పర్యటన చేశారు. ఈ పర్యటనలో భాగంగా స్థానిక ప్రజలు ,పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గోన్నారు. ఈనేపథ్యంలోనే ఓ కార్యకర్త తమ ప్రాంతంలో ఉన్న సమస్యలను సాధ్వీ దృష్టికి తీసుకువెళ్లారు. తమ ప్రాంతంలో లావెట్రీలు,డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేదని పిర్యాధు చేశారు. దీంతో స్పందించిన ఆమే తాను లావేట్రిలు, డ్రైనేజీలే క్లీన్ చేసేందుకు ఎంపీగా కాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దయచేసి అర్థం చేసుకోండి, నేను చేసే పని వేరే ఉంది దాన్ని పూర్తి చేస్తాను, ఇదివరకే ఈ విషయాన్ని చెప్పాను, మళ్లి చెబుతున్నాను అని తేల్చి చెప్పింది.

 wasnt elected to get drains and toilets cleaned says MP Pragya Singh Thakur

దీంతో ఆమే చేసిన వ్యాఖ్యలు వివాదస్పదమయ్యాయి. ముఖ్యంగా స్వచ్ఛభారత్‌ కార్యక్రమంలో భాగంగా ఏకంగా ప్రధాన మంత్రి మోడీ చీపూరు పట్టి ఊడ్చిన పరిస్థితి ఉంది. ఇందులో భాగంగానే ఎంపీలు ,ఇతర ప్రజా ప్రతినిధులు సైతం స్వఛ్చ భారత్‌లో భాగంగా క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమంలో పాల్గోన్నారు. కాని సాధ్వీ మాత్రం ఇందుకు విరుద్దంగా వ్యాఖ్యలు చేయడంతో పార్టీ వర్గాల్లోనే వ్వతిరేకత ప్రారంభమైంది. మరి సాధ్వీ వ్యాఖ్యలను కేంద్రం ఏ కోణంలో చూస్తుందో వేచి చూడాలి.

English summary
Pragya Singh Thakur, a first-time BJP parliamentarian from Madhya Pradesh, has told party workers that she "wasn't elected to get drains and toilets cleaned", a statement that many saw as arrogant and at odds with Prime Minister Narendra Modi's "Swachh Bharat Abhiyan" or clean India mission.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X