వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ముంబై విమానాశ్రయంలో ఏపీవాసికి గుండెపోటు, ప్రాణాలు కాపాడిన సెక్యూరిటీ ఆఫీసర్(వీడియో)

|
Google Oneindia TeluguNews

ముంబై: మహారాష్ట్రలోని ముంబై విమానాశ్రయంలో ఓ సెక్యూరిటీ అధికారి గుండె జబ్బుతో పడిపోయిన వ్యక్తికి సీపీఆర్ చేసి ప్రాణాపాయస్థితి నుంచి కాపాడారు. ఈ సంఘటన అక్టోబర్ 26వ తేదీన ముంబై ఆసుపత్రిలో జరిగింది. అనంతరం గుండె జబ్బుతో బాధపడిన వ్యక్తిని నానావతి ఆసుపత్రికి తరలించారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది.

సదరు సెక్యూరిటీ ఆఫీసర్ దాదాపు 30 సెకన్ల పాటు సీపీఆర్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో అక్కడి సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయి ఉంది.

Watch: CISF Officer Saves Man With CPR at Mumbai Airport

మోహిత్ కుమార్ శర్మ అనే సీఐఎస్ఎఫ్ (సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్) అధికారి అక్టోబర్ 26న విధుల్లో ఉన్నారు. ఆ సమయంలో గుబ్బల సత్యనారాయణ అనే వ్యక్తి విమానాశ్రయంలో ఉన్నారు. గుబ్బల సత్యనారాయణ ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారు. అతను ముంబై నుంచి హైదరాబాద్ వచ్చేందుకు విమానాశ్రయానికి వచ్చారు.

టెర్మినల్ 2 సమీపానికి రాగానే సత్యనారాయణకు గుండెపోటు వచ్చింది. అది చూసిన అధికారి శర్మ వెంటనే అక్కడకు వచ్చారు. సత్యనారాయణకు సీపీఆర్ చేశారు. అనంతరం అతనిని నానావతి ఆసుపత్రికి తరలించారు.

ఇలాంటి సంఘటనే ఈ ఏడాది జూలైలో కూడా జరిగింది. అమెరికాకు చెందిన ఓ ప్రయాణీకుడికి ఢిల్లీ విమానాశ్రయంలో గుండెపోటు వచ్చింది. అతను అప్పుడు ముంబై నుంచి ఢిల్లీకి వెళ్లాడు. అప్పుడు కూడా అక్కడి అధికారి సీపీఆర్ చేశారు.

English summary
CISF personnel acted quickly and saved a man who had suffered cardiac arrest and collapsed inside the Mumbai airport on Friday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X