Viral video:అవ్వ..సూపర్, టికెట్ ఇచ్చేవరకు వదల్లేదుగా, వైరల్

ఓట్ల కోసం నేతలు.. జనాలను ఉచితాలకు అలవాటు చేశారు. ఉచితం, ఫ్రీ అని ఆఫర్ చేశారు. తాయిలాలు కంటిన్యూ అవుతున్నాయి. దీంతో అంతా బీర్, బిర్యానీకి ఆశపడుతున్నారు. కొందరు నీతులు చెబుతున్నా.. ఆచరించడం లేదు. కానీ తమిళనాడుకు చెందిన ఆ వృద్ధ మహిళ మాత్రం అదేం లేదని అంటోంది. తన టికెట్ తనకు జారీ చేయాలని కోరుతుంది.

టికెట్ ఇవ్వమని గోల

టికెట్ ఇవ్వమని గోల

కోయంబత్తూరుకు చెందిన మహిళ బస్సు ఎక్కింది. కండక్టర్‌ను టికెట్ ఇవ్వమని కోరితే వద్దని చెప్పాడు కానీ ఆమెకు ఆత్మభిమానం ఎక్కువ.. అందుకే అడిగి మరీ టికెట్ తీసుకుంది. అతను వద్దులే ఇవ్వనని చెప్పినా వినిపించుకోలేదు. గతేడాది తమిళనాడులో డీఎంకే ప్రభుత్వం కొత్త నిబంధన అమల్లోకి తీసుకొచ్చింది. రాష్ట్రం ప్రభుత్వం ఆధీనంలో నడిచే బస్సులలో మహిళలు ప్రయాణం ఫ్రీ అని తెలిపింది. అప్పటినుంచి లేడీస్‌కు టికెట్ లేదు.

ఇవ్వనన్న కండక్టర్

ఇవ్వనన్న కండక్టర్


ఇలా ఓ మహిళ బస్సు ఎక్కింది. కండక్టర్ టికెట్ ఇవ్వవలేదు. దీంతో ఆమె గొడవకు దిగింది. టికెట్ ఇవ్వమంటే.. ఇవ్వు అని చెప్పింది. చివరకు కండక్టర్ టికెట్ ఇవ్వవలసి వచ్చింది. లేదంటే ముసలావిడ ఊరుకోవడం లేదు. అందుకే టికెట్ ఇష్యూ చేయడంతో గొడవ సద్దుమణిగింది. లేదంటే ఇచ్చేవరకు ఆ అవ్వ ఊరుకోలేదు.

 విలువలు, ఆదర్శాలు

విలువలు, ఆదర్శాలు


ఈ కాలంలో విలువలు, ఆదర్శాల పేరుతో కొందరే ఉంటున్నారు. వారిలో ఈ కోయంబత్తూరుకు చెందిన మహిళ నిలిచారు. అవును లేదంటే.. ఫ్రీగా వెళ్లు.. నాయనో అన్న ఆమె వినలేదు. టికెట్ ఇష్యూ చేయాల్సిందేనని గొడవకు దిగింది. దీంతో కండక్టర్ టికెట్ ఇవ్వాల్సి వచ్చింది. వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. నెటిజన్లు చాలా చక్కగా కామెంట్స్ చేస్తున్నారు. వావ్.. అవ్వ అని అంతా అంటున్నారు.మీరు మా లాంటి వారికి ఆదర్శంగా నిలుస్తారని కామెంట్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+