viral video:కాలనాగుపై కాలు వేయబోయి, పడగతీసిన సర్పం, వాయువేగంతో స్పందించిన తల్లి
పాము.. అంటే భయపడని వారుండరు. అవును పిల్లే కాదు పెద్దలు కూడా ఎగిరి గంతేస్తారు. మరీ అదీ 10 అడుగుల వరకు ఉండే కాలనాగును చూస్తేనే గుండె హడలి పోతుంది. అలాంటి సమయంలో ఆ పాము పడగ తీస్తే.. అంతే సంగతులు.. కానీ ఓ తల్లి మాత్రం చెక ధైర్య సాహసాలను ప్రదర్శించింది. తన బిడ్డ కోసం ప్రాణాలకే తెగించిన పని చేసింది. నాగు పడగ తీసిన ధైర్యంగా నిలిచింది. దాని బారి నుంచి కాపాడింది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మీరు కూడా ఆ వీడియోను చూడండి.

10 అడుగుల కాలనాగు..
కర్ణాటకలో గల మాండ్య జిల్లాలో ఈ ఘటన జరిగింది. సీసీటీవీలో రికార్డయిన విజువల్ చూస్తే.. ఎంతటివారికైనా భయపడుతారు. అవును ఇంటి నుంచి బిడ్డతో సహా తల్లి బయటకు వస్తోంది. కానీ అప్పటికే ఓ కాలనాగు అక్కడ ఉంది. బిడ్డ కింద అడుగు పెట్టాడు. జస్ట్ కాస్తలో మిస్సయ్యింది. ఆ పాము వెంటనే లేచింది. ఇంకేముంది తల్లి కూడా అదేస్థాయిలో స్పందించింది. వెంటనే పిల్లాడి వద్దకు వచ్చింది. అతనిని ఎత్తుకొని అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఆ పాము కూడా తన దారిని తాను వెళ్లింది.
అడుగువేసినంత పనిచేసిన బాలుడు
30 సెకన్ల నిడివి గల వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. పిల్లాడు పాము మీద అడుగు పెట్టినంత పనిచేశాడు. ఆ పాము వెనక్కి వెళ్లి.. పడగ తీసింది. వెంటనే తల్లి పిల్లాడిని దగ్గరకు తీసుకుంది. ఆ వీడియోను ఒకరు ట్విట్టర్‌లో షేర్ చేశారు. ఇంకేముంది సోషల్ మీడియాలో తెగ ట్రోల్ అవుతుంది. ఇప్పటికే 58 వేల మంది చూశారు. 800 మంది రీ ట్వీట్ చేశారు. 3156 మంది లైక్ చేశారు. చాలా మంది కామెంట్స్ చేశారు.

తల్లి నీకు వందనం..
వావ్.. ఆ తల్లి చూపిన తెగువ మాములగా లేదన్నారు. మీరు చుట్టు పక్కల చాలా జాగ్రత్తగా ఉండాలని మరొకరు రాశారు. థాంక్ గాడ్.. వారిద్దరూ సేవ్ అయ్యారని మరొకరు రాశారు. నిజమే ఆ పామును చూసి తల్లి బెదరలేదు. ధైర్యంగా ఎదుర్కొంది. తన పిల్లాడిని అక్కున చేర్చుకుంది. అక్కడినుంచి వెళ్లడంతో.. ఆ కాలనాగు కూడా తన దారిలో తాను వెళ్లింది. వీడియో చూడడానికే భయమేస్తుందని చాలా మంది నెటిజన్లు కామెంట్ చేశారు.
-
ఇంటికి పిలిచి మరీ రష్మిక ముద్దుల వర్షం! వీడియో -
ఏడవడానికి కూడా రేటు.. బిజినెస్ అంటే ఇతనిదే! -
బ్రావో ఇంట్లో ఆ ఇద్దరు అమ్మాయిలు ఎవరు? రహస్యాలు లీక్! వీడియో -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ












Click it and Unblock the Notifications