ఇళ్లల్లోకి వచ్చిన చిరుత: జనం బెంబేలు, పరుగులు(వీడియో)

డెహ్రాడూన్: సాధారణంగా ఇళ్లపైకి కోతులు వస్తేనే.. భయపడిపోతుంటాం.. ఇక్కడ మాత్రం ఏకంగా చిరుతపులే ఇళ్లపైకి వచ్చింది. ఇంకేముందు జనమంతా బెంబేలెత్తిపోయారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు తీశారు. ఈ ఘటన ఉత్తరాఖండ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది.

ఆ వివరాల్లోకి వెళితే.. డెహ్రాడూన్‌లోని కేవల్ విహార్ ప్రాంతంలోని ఓ నివాస ప్రాంతంలోకి చిరుత పులి ప్రవేశించింది. శాస్త్రబుద్ధి అనే రోడ్డులోని పలు నివాసాల ఇళ్లపైకి ఎక్కింది. ఓ ఇంటిపై కూర్చున్న చిరుత.. అటూ ఇటూ పరుగెత్తుతూ క్షణాల్లో ఆ కాలనీ మొత్తాన్ని భయాందోళనకు గురిచేసింది.

ఇళ్లపై ఉన్న కొందరు కేకలు వేస్తూ అటూ ఇటూ పరుగులు తీశారు. ఓ ఇంటి వద్దకు చిరుత రావడంతో ఆ ఇంట్లోని వారు బయటకు పరుగులు తీశారు. ఒంటరిగా ఉన్న వారివైపు దూసుకెళ్లిన చిరుత.. అరుపులు కేకలు వేయడంతో అక్కడ్నుంచి పరారైంది.

దీంతో అటవీశాఖ అధికారులు చిరుతకు మత్తు మందిచ్చి పట్టుకునేందుకు చేసిన ప్రయత్నం విఫలమే అయ్యింది. కాగా, ఆ చిరుత ఎవరినీ ఏమి చేయకుండా పారిపోవడంతో అక్కడి జనమంతా ఊపిరిపీల్చుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+