Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

‘పద్మావతి’ పాటకు డ్యాన్ చేసిన ములాయం కోడలు(వీడియో)

లక్నో: ఇప్పటికే వివాదాలతో దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన 'పద్మావతి' చిత్రం మరోసారి వార్తల్లోకి ఎక్కింది. ఈ సారి ఉత్తర్‌ప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ నేత ములాయం సింగ్‌ యాదవ్‌ చిన్న కోడలు ఇందుకు కారణంగా నిలిచారు.

ఎందుకంటే.. అపర్ణ యాదవ్‌ 'పద్మావతి' చిత్రంలోని 'ఘూమర్‌' పాటకు డ్యాన్స్‌ చేశారు. లక్నోలో అప‌ర్ణ త‌న సోద‌రుడి నిశ్చితార్థ వేడుక‌లో ఈ డ్యాన్స్ చేసిన‌ట్లు తెలుస్తోంది.

అయితే, రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ కూడా యూపీలో ఈ సినిమా విడుదలకు ఒప్పుకోలేదు. అలాంటిది ఇదే రాష్ట్రానికి చెందిన మాజీ ముఖ్యమంత్రి కోడలు 'పద్మావతి' చిత్రంలోని పాటకు డ్యాన్స్‌ చేయడం గమనార్హం. ములాయం సింగ్ కోడలు ఈ చిత్ర పాటకు డ్యాన్స్ చేయడం యూపీలో సంచలనంగా మారింది.

కాగా, సంజయ్‌ లీలా భన్సాలీ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి పశ్చిమబెంగాల్,మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలు మినహా మిగతా రాష్ట్రాలన్నీ వ్యతిరేకిస్తున్నాయి.

ఈ చిత్రంపై వేసిన మూడో పిటిషన్‌ను తిరస్కరిస్తూ మంగళవారం సుప్రీం కోర్టు తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. దాదాపు అన్ని రాష్ట్రాల్లో ఈ చిత్రానికి వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. అయితే, అదే విధంగా పలువురి నుంచి మద్దతు కూడా లభిస్తోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+