వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Viral video:హవ్వా ఏంటీ ఇదీ, విద్యార్థులతో ఈ పని చేయిస్తారా..? వైరల్

|
Google Oneindia TeluguNews

విద్యార్థులే భావి భారత పౌరులు.. వారికి చక్కగా విద్య నేర్పించి.. ఉన్నత స్థానంలోకి తీసుకొచ్చేందుకు దోహదపడాలి. వారికి విద్య, వైద్యం అందించి.. జాతి ఉన్నతికి తోడ్పడాలి. పిల్లల చేత పనులు/ వెట్టి చాకిరి చేయించొద్దు అని రాజ్యాంగంలో రాశారు. కఠిన చర్యలు అని కూడా చెప్పారు. కానీ నేటికి ఎక్కడో ఒక చోట పిల్లల చేత పనులు చేయిస్తున్నారు. ఇప్పటికీ కొన్ని చోట్ల అలా జరుగుతున్నాయి. అయితే ఎన్నికల సిబ్బందికి విద్యార్థుల చేత భోజనం పెట్టించారు. ఇదీ వైరల్ అవుతుంది. చాలా మంది నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు.

 బై పోల్.. విద్యార్థుల చేత..

బై పోల్.. విద్యార్థుల చేత..

ఉత్తర ప్రదేశ్ ముజఫర్ నగర్ జిల్లాలో గల కైలావడ కల పంచాయతీలో సభ్యుడి ఉప ఎన్నిక జరిగింది. ఎన్నికలు జరిగితే.. అందుబాటులో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించడం జరుగుతుంది. అయితే అక్కడ కూడా కండక్ట్ చేశారు. అయితే విధుల్లో ఉన్న సిబ్బందికి కొందరు బాలికలు స్కూల్ డ్రెస్ వేసుకొని మరీ భోజనం వడ్డించారు. క్లాస్ రూమ్‌లో గల డెస్క్ వద్ద సిబ్బంది అందులో కనిపించారు.

భోజనం వడ్డించి

భోజనం వడ్డించి


ఇతర గదుల్లో ఉన్నవారికి కూడా అలానే విద్యార్థులు భోజనం సర్వ్ చేశారు. ఇంకేముంది.. అందరికీ స్టూడెంట్స్ భోజనం అందజేశారు. దీనికి ఒకరు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇంకేముంది తెగ వైరల్ అవుతుంది. ఈ అంశం జిల్లాలో చర్చానీయాంశం అవుతుంది. ఇదీ పెద్ద దుమారమే రేపింది. ఘటనపై స్కూల్ ప్రిన్సిపల్‌ను వివరణ కోరగా.. విద్యార్థులను వడ్డించమని కోరలేదని తెలిపింది.

 ఇదీ సరికాదు

ఇదీ సరికాదు


విద్యార్థుల చేత వడ్డించమని చెప్పడం ఏంటీ అని అంతా తప్పుపడుతున్నారు. ఇదీ సరికాదని అంటున్నారు. ఎవరూ దొరకనట్టు.. స్టూడెంట్స్ చేత వడ్డించమని కోరడం ఏంటీ అని అడుగుతున్నారు. ఇదీ మంచి పద్దతి కాదని ఫైర్ అవుతున్నారు. పిల్లల చేత పనులు చేయించడమా..? అదీ కూడా స్కూల్‌లో అని అడుగుతున్నారు. పాఠాలు చెప్పాల్సింది పోయి.. ఇలా పనులు చేయించడమా అని అడుగుతున్నారు.

English summary
video is going viral on social media in which some schoolgirls dressed in school uniforms were seen feeding food to the employees engaged in election duty.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X