Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

VIRAL :వామ్మో.. బ్యాగులో పాము, తీయగా పరుగు, చంపిన టీచర్

మనం షూలో పాము ఉండటం చూశాం. ఆ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మరీ స్కూల్ బ్యాగ్‌లో పాము.. ఇప్పటివరకైతే అలాంటి ఘటన రాలేదు. కానీ అలాంటి ఇన్సిడెంట్ ఒకటి మధ్యప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. ఓ పాప బ్యాగ్‌లో పాము కనిపించింది. ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు.

ఛాతర్‌పూర్‌లో గల పిర గ్రామంలో ఈ ఘటన జరిగింది. ఎప్పటిలానే అందరూ స్కూల్‌కు వచ్చారు. అలా ఓ ఆరేళ్ల పాప కూడా వచ్చింది. అయితే ఆమె తీసుకొచ్చిన బ్యాగులో పాము ఉంది. ఎప్పటిలాగే స్కూల్‌కు వచ్చిన చిన్నారి.. పెన్సిల్ కోసం బ్యాగులో చేయి పెట్టింది. చల్లగా తగలడంతో టీచర్‌కు చెప్పింది. ఇంకేముంది వారు ఆ బ్యాగును పాఠశాల గ్రౌండ్ వద్దకు తీసుకొచ్చారు.

 WATCH:Snake slithers out of girls bag

అక్కడ ఓ టీచర్ కర్ర పట్టుకొని రెడీగా ఉన్నాడు. మెల్లిగా తీయగా అందులోంచి పాము బయటకు వచ్చింది. ఇంకేముంది చిన్నారి చెప్పింది నిజమైంది. అందులో పాము ఉంది. ఆ పాము కూడా తర్వాత వెళ్లేందుకు ప్రయత్నించింది. అప్పటికే అక్కడ ఉన్న టీచర్.. కర్రతో దానిని కొట్టేశాడు. దీంతో హమ్మయ్యా అని అక్కడ ఉన్న వారంతా ఊపిరి పీల్చుకున్నారు.

అవును పాము, పామే, దానిని చూసిన వారికి ఎవరికైనా భయం వేస్తోంది. ఆ చిన్నారి కూడా అలానే భయపడింది. వెంటనే టీచర్‌కు చెప్పి.. బ్యాగు తీయడంతో బయటకు వచ్చింది. ఇంతకీ బ్యాగులో పాము ఎలా వచ్చిందనే అంశంపై మాత్రం స్పష్టత లేదు. ఇంటి వద్దే వచ్చి ఉంటుంది. స్కూల్ వద్ద వచ్చే అవకాశం లేదు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+