
viral video:శభాష్.. ఒక చేయి లేకున్నా, పావ్ బజ్జీ స్టాల్, ఎక్కడ అంటే...?
అవిటివారు చాలా మంది భిక్షాటన చేస్తుంటారు. ఏం పని చేయలేమని కొందరు చెబుతుంటారు. మరికొందరికీ ఆత్మవిశ్వాసం ఎక్కువ.. సో వారు సొంతంగా ఏదైనా పని చేస్తుంటారు. అలాంటి కోవకు చెందిన వ్యక్తి ముంబైలో ఉన్నారు. ఇంకేముంది.. అతను తన సొంతకాళ్లపై నిలబడ్డాడు. అవును పావ్ బజ్జీ బండి నడిపిస్తున్నాడు. మిగతా వారికి ఆదర్శంగా నిలుస్తున్నాడు. ఆ వీడియో మీరు కూడా చూడండి.

పావ్ బజ్జీ స్టాల్..
ముంబైలో గల మలాద్ వద్ద పావ్ బజ్జీ స్టాల్ ఉంది. అయితే అక్కడ ఉన్న నిర్వాహకుడికి ఒక చేయి లేదు. కానీ బండి నడిపిస్తున్నాడు. పావ్ బజ్జీ కోసం ఆయన కూరగాయాలు కట్ చేయడం వీడియోలో చూడొచ్చు. చేతిలో కత్తి పట్టుకుని.. వేళ్లతో కట్ చేయడం అబ్బురపరుస్తోంది. అలాగే పావ్ బజ్జీ వేడి చేయడం, ప్యాకెట్స్‌లలో వేయడం కనిపిస్తోంది. వీడియో నిజంగానే మిగతా వారికి ప్రేరణ కలిగిస్తోంది.

వావ్.. అంటోన్న నెటిజన్లు
వీడియో చూసి ఇంటర్నెట్ చప్పట్లు కొడుతుంది. ఇప్పటికే 35.5 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. 3.8 మిలియన్ల లైకులు రాగా.. వేలాది మంది కామెంట్స్ చేశారు. అతని కష్టపడే తత్వాన్ని ప్రతీ ఒక్కరు కొనియాడుతున్నారు. కష్టపడాలని అనుకునేవారికి, లేజీగా ఉండేవారికి ఈ వీడియో చాలా ఉత్తేజిత్తులను చేస్తోంది. పనిలో అతనికి ఉన్న నిబద్దతకు సెల్యూట్ అని ఒకరు కామెంట్ చేశారు. కష్టపడి పనిచేసేవారికి ఏదీ కూడా అసాధ్యం కాదని మరొకరు రాశారు. అతనికి ఆ భగవంతుడి ఆశీస్సులు ఉండాలని మరొకరు రాశారు. ఇతరులకు అతను అవకాశం ఇవ్వరు అని మరొకరు రాశారు.
ఆదర్శం
అవును.. అతను తన సొంత కాళ్లపై నిలబడ్డాడు. అందుకోసం కష్టపడి మరీ పనిచేస్తున్నాడు. మిగతా అవిటి వారికి ఆదర్శంగా నిలుస్తున్నారు. మరికొందరు తమకు అవీ లేవు, ఇవీ లేవు అనేవారిని ఇన్‌స్పైర్ చేస్తున్నారు. లేదంటే ఒక చేతితో స్టాల్ పెట్టడం.. దానిని రన్ చేయడం మాములు విషయం కాదు. వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ అవుతుంది. ప్రతీ ఒక్కరూ శభాష్ అని కామెంట్ చేస్తున్నారు.