viral video:వావ్.. నయాగారను మించే పాల్స్.. మన దేశంలోనే, ఎక్కడంటే
వర్షాలు కురుస్తున్నాయి. చల్లని వాతావరణం.. ఈ సమయంలో జలపాతాల వద్దకు వెళితే ఆ కిక్కే వేరు.. పాల్స్ అంటే నయాగారనే గుర్తుకు వస్తాయి. వాటిని చూస్తే తనివి తీరదు. అంతా వాటి గురించి చర్చిస్తారు. ఇప్పుడు మన దేశంలో కూడా అలాంటి ఫాల్ ఉంది. అదీ కూడా కర్ణాటకలో మరీ.. దాని గురించి తెలుసుకుందాం.. పదండి

జోగ్ పాల్స్
కర్ణాటక షిమొగ్గ జిల్లా జోగ్ పాల్స్ ఉన్నాయి. ఇవీ అచ్చం నయగార పాల్స్‌ను తలపిస్తున్నాయి. చూడటానికి ముచ్చట వేస్తున్నాయి. చూసి చాలా మంది ఇవీ నయగారా లేక మరొటా అని అంటున్నారు. వీడియోను మాజీ నార్వే అధికారి ఎరిక్ షేర్ చేశారు. అవీ జోగ్ పాల్ అని.. ఇండియాలో ఉందని చెప్పారు. వీడియో ట్వీట్ చేయగా.. తెగ వైరల్ అవుతుంది.

1.8 మిలియన్ల వ్యూస్
చాలా మంది ఆ వీడియోను షేర్ చేస్తున్నారు. ఇప్పటికే 1.8 మిలియన్ల మంది సదరు వీడియోను చూశారు. వేలాది మంది లైక్ చేశారు. వందలాది మంది రీ ట్వీట్ చేశారు. జలపాతం అంటే ఇదీ.. ఇలా ఉండాలి.. చాలా అందంగా ఉందని రాసుకొచ్చారు.

3.7 మిలియన్ వ్యూస్
మరోవైపు మహారాష్ట్రలో నానెఘాట్ జలపాతం కూడా ఇటీవల వైరల్ అయ్యింది. ఇక్కడ నీరు రివర్స్‌గా పారడం విశేషం. రెండు కొండల నుంచి నీరు పైకి వెళతుంది. ఇదీ చూడముచ్చటగా ఉంటుంది. వీడియోను ఐఎఫ్ఎస్ అధికారి సుశాంత నందా షేర్ చేశారు. ఇప్పటికే 3.7 మిలియన్ల వ్యూస్ వచ్చాయి.
Your "Life" is more important than your "Likes". pic.twitter.com/3XNjyirbwJ
— Dipanshu Kabra (@ipskabra) July 13, 2022












Click it and Unblock the Notifications