viral video:శభాష్.. సింగ్: గురువుకు బాధతో వీడ్కోలు, బదిలీ అయితేనే ఇంతలా, వైరల్
గురువుకు గురుతర బాధ్యత ఉంటుంది. పిల్లలకు మంచి నడవడిక నేర్పుతారు. వారి ఉన్నతికి తోడ్పడుతారు. సరైన శిక్షణ, క్రమశిక్షణ అలవరచి, మంచి మార్గంలో వెళ్లేందుకు తోడ్పడుతారు. నిన్న గురు పౌర్ణమి జరిగింది. అయితే ఉత్తర ప్రదేశ్‌లో ఓ బడి పంతులు విద్యార్థుల హృదయాలను గెలిచాడు. అతను బదిలీపై వెళుతుంటే.. పిల్లలు పట్టుకుని వదలల్లేదు. వద్దు సార్.. వెళ్లొద్దు అని ఏడ్చారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మీరు కూడా చూడండి.

టీచర్.. శివేంద్ర సింగ్
చందౌలి జిల్లా రాయ్‌ఘడ్ గ్రామం.. ఇదీ మారుమూల ప్రాంతం. అంటే అక్షరాస్యత తక్కువే.. దాంతోపాటు ఎడ్యుకేట్ చేసేవారు రేర్.. సో ఇంకేముంది చదివి ప్రయోజకులు అయినవారు తక్కువ మంది ఉన్నారు. ఇక్కడికి శివేంద్ర సింగ్ అనే టీచర్ వచ్చాడు. నాలుగేళ్లు వారితో ఉన్నారు. విద్యార్థులకు మంచి, చెడులు చెప్పి వారిలో ఒకడు అయిపోయాడు. కానీ ప్రభుత్వ టీచర్లు అంటే బదిలీ ఉంటుంది కదా.. సో అతనికి కూడా ట్రాన్స్ ఫర్ తప్పలేదు. మరీ ఆ విద్యార్థులు మాత్రం గుండె తరుక్కుముంది. కంటి నుంచి నీరు ఆగలేదు.

వీడ్కోలు..బాధతోనే
మంగళవారం రోజున శివేంద్ర సింగ్‌కు వీడ్కోలు పార్టీ ఇచ్చారు. కానీ ఫెర్ వెల్ పార్టీలో విద్యార్థుల ఏడుపు ఆగలేదు. విద్యార్థిని, విద్యార్థులు హగ్ చేసుకున్నారు. మరికొందరు గట్టిగా పట్టుకున్నారు. వారిని ఓదార్చే ప్రయత్నం చేశారు. కానీ అతనికి కూడా కన్నీరు ఆగలేదు. అంతకుముందు విద్యార్థులు, కొలిగ్స్ కలిపి బహుమతులను అందజేశారు.

సముదాయించి.. ఏడ్చి
విద్యార్థులను సముదాయించే ప్రయత్నం చేశారు సింగ్.. తాను మళ్లీ వస్తానని చెప్పారు. అప్పటివరకు మీరు కష్టపడి చదవాలని కోరారు. మీరు మంచి స్థితిలోకి రావాలని కోరుకున్నారు. అతని టీచింగ్ టెక్నిక్స్ అంటే విద్యార్థులు అమితంగా ఇష్టపడేవారు. డ్రాయింగ్ గురించి చెప్పేవారు. సోషల్ మీడియాలో పలు రకాల అంశాల గురించి విద్యార్థులతో షేర్ చేసుకునేవారు. ఇలా చేయడం స్కూల్‌లో అటెండెన్స్ భారీగా పెరిగింది.

యువర్ గ్రేట్ సింగ్
వాస్తవానికి ఆ గ్రామం కొండ మీద ఉంటుంది. వారికి క్రికెట్ తప్ప మరొ ఆట తెలియదు. వారికి ప్రపంచం గురించి తెలియజేసేందుకు చాలా మార్గాలను అన్వేషించారు. కానీ వారిని వదిలివెళ్లడం తనకు కూడా బాధగా ఉందని చెప్పారు. నిజమే ఇలాంటి టీచర్ ఉండటంతో మిగతా వారికి కూడా మంచి చేయాలని.. విద్యా బుద్దులు చెప్పాలని అనిపిస్తోంది. యువర్ గ్రేట్ మిస్టర్ శివేంద్ర సింగ్ అని నెటిజన్లు అంటున్నారు.












Click it and Unblock the Notifications