Water war: ఒక్క నీటి బొట్టులో తేడా ఉండదు, రెండు రాష్ట్రాలకు న్యాయం చేస్తాం. కేంద్ర మంత్రి క్లారిటి !
బెంగళూరు/చెన్నై: నీటి పంపకాల విషయంలో ఆంధ్రప్రదేశ్- తెలంగాణ, అక్కడ కర్ణాటక-తమిళనాడు ప్రభుత్వాలు ఫైటింగ్ చేస్తున్న సమయంలో కేంద్ర మంత్రి క్లారిటీ ఇచ్చారు. కర్ణాటక-తమిళనాడు మద్య వివాదానికి కారణం అయిన మేకదాటు ప్రాజెక్టు విషయంలో మా పని మేము చేస్తామని, ఇక్కడ తారతమ్యాలు, పక్షపాతదోరణి ఉండదని కేంద్ర జనవనరుల శాఖా మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ అన్నారు. కర్ణాటకలో మా పార్టీ వాళ్లు అధికారంలో ఉన్నారని, తమిళనాడులో మా పార్టీ అధికారంలో లేదని తేడా ఏమీ ఉండదని, నీటి పంపకాల విషయంలో మా పని మేము చేస్తామని, మా మీద ఎవ్వరు ఒత్తిడి చేసినా మేము ఏ మాత్రం పట్టించుకోమని కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తేల్చి చెప్పారు.

తమిళనాడు VS కర్ణాటక
తమిళనాడు సరిహద్దులోని కర్ణాటక ప్రభుత్వం మేకదాటు తాగునీటి ప్రాజెక్టు నిర్మించడానికి సిద్దం అయ్యింది. మేకదాటు ప్రాజెక్టు నిర్మాణం చేపట్టరాదని తమిళనాడు ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. జయలలిత ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి మేకదాటు ప్రాజెక్టు విషయంలో తమిళనాడు ప్రభుత్వం, కర్ణాటక ప్రభుత్వాలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటూనే ఉన్నాయి.

కావేరి లొల్లి ఇక్కడికి దారితీసింది
కావేరి నీటి పంపిణి విషయంలో దశాభ్దాల కాలంగా తమిళనాడు, కర్ణాటక ప్రభుత్వాల మద్య వివాదం ఉంది. ఇప్పుడు మేకదాటు ప్రాజెక్టు నిర్మిస్తే కావేరీ నిటి పంపిణి విషయంలో మాకు అన్యాయం జరుగుతోందని తమిళనాడు ప్రభుత్వం ఆరోపిస్తోంది. బెంగళూరు ప్రజల తాగునీటి కష్టాలు తీర్చాలంటే మేకదాటు ప్రాజెక్టు నిర్మించాలని కర్ణాటక ప్రభుత్వం వాదిస్తోంది.

కేంద్ర మంత్రి రాకతో సెగ పుట్టింది
కేంద్ర జనవనరుల శాఖా మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ బెంగళూరు వచ్చారు. మంగళవారం బెంగళూరులోని విధాన సౌదలో జల జీవన్ మిషన్ ప్రాజెక్టు విషయాలపై కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మేకదాటు ప్రాజెక్టు విషయంతో పాటు నీటి పంపకాల విషయంలో చర్చ జరిగింది. ఈ అత్యున్నత సమావేశం అనంతరం కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ మీడియాతో మాట్లాడారు.

పార్టీలు ముఖ్యం కాదు
కర్ణాటక-తమిళనాడు మద్య వివాదానికి కారణం అయిన మేకదాటు ప్రాజెక్టు విషయంలో మా పని మేము చేస్తామని, ఇక్కడ తారతమ్యాలు, పక్షపాతదోరణి ఉండదని కేంద్ర జనవనరుల శాఖా మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ అన్నారు. కర్ణాటకలో మా పార్టీ వాళ్లు (బీజేపీ) అధికారంలో ఉన్నారని, తమిళనాడులో డీఎంకే పార్టీ అధికారంలో ఉందని, అక్కడ మా పార్టీ లేదని తేడా ఏమీ ఉండదని కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ చెప్పారు,

అందరికి న్యాయం చేస్తాం
మేకదాటు ప్రాజెక్టు నిర్మాణం, కావేరీ నీటి పంపకాల విషయంలో మా పని మేము చేస్తామని, మా మీద ఎవ్వరు ఒత్తిడి చేసినా మేము పట్టించుకోమని కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తేల్చి చెప్పారు. కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నీటి పంపిణి విషయంలో ఇద్దరికి న్యాయం చేస్తామని. కేంద్ర ప్రభుత్వం తన పని తాను చేస్తోందని, ఇక్కడ ముసుగులో గుద్దులాట ఏమీ ఉండదని కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అన్నారు. రెండు రాష్ట్రాలకు నీటి బొట్టు విషయంలో తేడా మాత్రం రాదని, ఎవరివాటాలు వాళ్లకు వచ్చే విదంగా కేంద్ర ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుంటుందని కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ క్లారిటీ ఇచ్చేశారు.

ఇక్కడ ఆంధ్రా- తెలంగాణ, అక్కడ కర్ణాటక- తమిళనాడు
నీటి పంపకాల విషయంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు పోట్లాడుకుంటున్న సమయంలో ఇప్పుడు తమిళనాడు, కర్ణాటక ప్రభుత్వాల మద్య మేకదాటు ప్రాజెక్టు విషయంలో రచ్చ జరుగుతున్న సమయంలో కేంద్ర మంత్రి బెంగళూరుకు భేటీ కావడం రెండు రాష్ట్రాల మద్య హీటుపు
-
విజయ్ కు డిప్యూటీ సీఎం, 80 సీట్లు ఆఫర్? -
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
ఆ హీరోతో లిప్ లాక్ చేశానని మా పేరెంట్స్ తిట్టారు - స్టార్ బ్యూటీ -
employees: ఉద్యోగులకు భారీ గుడ్ న్యూస్-ఒక్క దెబ్బకు డీఏ బకాయిలన్నీ క్లియర్..! -
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!? -
ఇక అమెరికా చేతుల్లోకి హార్మూజ్ జలసంధి: ట్రంప్ సంచలనం -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రివ్యూ.. 5కి ఎంత రేటింగ్ ఇచ్చారంటే..! -
సీఎం చంద్రబాబుకు అల్లు అర్జున్ క్షమాపణలు... పోస్ట్ వైరల్ !! -
టీమిండియా విజయం వెనుక ప్రభాస్.. అసలు విషయం చెప్పిన సూర్యకుమార్ యాదవ్












Click it and Unblock the Notifications