లోదుస్తులున్నాయా: అమ్మాయిలతో మంత్రి అసభ్యంగా..
చెన్నై: తమిళనాడు క్రీడలు, యువజన సర్వీసుల శాఖ మంత్రి సుందర్ రాజ్ విద్యార్థినులపట్ల అసభ్యంగా ప్రవర్తించాడని వెలుగు చూసింది. యువతులు జవాబులు చెప్పడానికి ఇబ్బందికరమైనటుంటి వివాదాస్పద ప్రశ్నలు చేసి వారిని ఆవేదనకు గురి చేశారని ఆలస్యంగా వెలుగు చూసింది.
ఇటీవల రాత్రి మంత్రి సుందర్ రాజన్ పుదుకొట్టాయ్ లోని ఓ పాఠశాల హాస్టల్ ను ఆకస్మికంగా సందర్శించారు. అదే సమయంలో అక్కడ ఉన్న హాకీ క్రీడాకారిణులతో మాట్లాడారు. మీకు తగినన్ని లోదస్తులు ఉన్నాయా అంటూ ఆ క్రీడాకారిణులకు ఇబ్బందికరమైన ప్రశ్నలు వేశారు.
మీరు ఎన్ని పతకాలు గెలిచారు అంటూ వారిని ప్రశ్నించారు. ఏ పతకం కూడా గెలవకుంటే మీకు ఎందుకు భోజనం పెట్టాలని వారిని ప్రశ్నించారు. తరువాత మరో విద్యార్థిని దగ్గరకు వెళ్లి నీవు బరువు పెరిగావా, లేదా అని ప్రశ్నించారు. నీకు భోజనం పెట్టడానికి రోజుకు రూ. 250 ఖర్చు చేస్తున్నామని అన్నారు.

మిగతా విద్యార్థులకు మాత్రం రూ. 200 ఖర్చు చేస్తున్నామని చెప్పారు. వారికంటే మీకు డబ్బు ఎక్కువ ఇస్తున్నాం, కేవలం మీ భోజనం కోసం మాత్రమే ఇస్తున్నామని హాకీ క్రీడాకారిణులతో అన్నారు. అంతటితో మంత్రిగారు సుందర్ రాజ్ తన నోటి దురుసుని వదిలి పెట్టలేదు.
మరో విద్యార్థిని దగ్గరకు వెళ్లారు. నీవు హాస్టల్ లో చేరిన తరువాత పెద్దమనిషి అయ్యావా ? లేదా అని ప్రశ్నించారు. మంత్రి ఇలా విద్యార్థినులతో వివాదాస్పద వ్యాఖ్యలు చెయ్యడంతో పెద్ద దూమరం రేపింది. అయితే తాను విద్యార్థినులకు ఇలాంటి ప్రశ్నలు వెయ్యలేదని, వారిని ప్రోత్సహించడానికి ప్రయత్నించానని మంత్రి సుందర్ రాజ్ అంటున్నారు.
-
ఈ రాశి వారికి ఆస్తి తగాదాలు తప్పవు..!! -
బుమ్రా బౌలింగ్.. అంత ఏం లేదు: వైభవ్ సూర్యవంశీ -
కుప్పకూలిన Gold ETF.. 18 ఏళ్లలో అతిపెద్ద పతనం.. -
తన భార్య గురించి విజయ్ సంచలన కామెంట్స్. 30 ఏళ్లు ఎదురుచూసి! -
రామ్ చరణ్ "పెద్ది" కోసం ప్రభాస్ ఫేవరెట్ బ్యూటీ.. -
Humsafar Express: శ్రీకాకుళం-తిరుపతి కొత్త వీక్లీ ఎక్స్ ప్రెస్-ఆ రోజు నుంచే..! -
సెకెనుకు 40,000 కి. మీ వేగంతో.. భూమి వైపు -
వాస్తు ప్రకారం ఐశ్వర్యాన్ని తెచ్చేది మనీప్లాంట్ కాదు.. 'క్రాసులా' మొక్కను పెంచాలి -
ఏపీలో ఈ నియోజకవర్గాలు ఇక మహిళలకే, సీనియర్లు.. మంత్రుల స్థానాలు ఔట్..!! -
పదో తరగతి ఫలితాల విడుదల పై తాజా నిర్ణయం..!! -
అది ఇస్త్రీ కొట్టా ? సాఫ్ట్ వేర్ కంపెనీనా ?? .. అకౌంట్ లో రూ.598 కోట్లు !! -
టోల్ కక్కండి- రేట్ ఖరార్ చేసిన ఇరాన్












Click it and Unblock the Notifications