అరంగేట్రం అద్దిరింది: భారీ రోడ్ షో

Priyanka Gandhi Vadra: కాంగ్రెస్ నాయకులు, అభిమానులు ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తోన్న సమయం ఆసన్నమైంది. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా ప్రత్యక్ష రాజకీయాల్లోకి అరంగేట్రం చేశారు. ఉప ఎన్నికలో పోటీ చేయనున్నారు.

ఊహించినట్టే- కేరళలోని వాయనాడ్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఆమె ఉప ఎన్నికలో పోటీకి దిగారు. ఆమె అన్న, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ రాజీనామా చేయడం వల్ల ఈ స్థానానికి ఉప ఎన్నిక అవసరమైంది. ఇక్కడ ప్రియాంక గాంధీ అభ్యర్థిత్వాన్నిఏఐసీసీ ఇదివరకే ఖరారు చేసింది.

Wayanad Lok Sabha bypoll Priyanka Gandhi Vadra files her nomination papers

దీనితో కొద్దిసేపటి కిందటే ఆమె తన నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. కల్పెట్టలో రిట్నరింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను అందజేశారు. తల్లి, కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, అన్న, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, భర్త రాబర్ట్ వాద్రా, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, ఇతర పార్టీ నాయకులు ఆ సమయంలో ఆమె వెంట ఉన్నారు.

వాయనాడ్ లోక్‌సభ స్థానం.. కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. 2009లో ఈ నియోజకవర్గం కొత్తగా ఏర్పాటుకాగా.. అప్పటి నుంచి కాంగ్రెస్ జెండా మాత్రమే ఎగురుతోంది. 2009, 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా ఎంఐ షానవాస్ గెలిచారు. 2019 నాటి ఎన్నికల్లో సందర్భంగా రాహుల్ గాంధీ ఎంట్రీ ఇచ్చారు. వాయనాడ్ నుంచి నాలుగు లక్షలకు పైగా ఓట్ల తేడాతో ఘన విజయం సాధించారు.

మొన్నటి లోక్‌సభ ఎన్నికల్లోనూ వాయనాడ్ నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారాయన. అదే సమయంలో తన తల్లి సోనియా గాంధీ ఖాళీ చేసిన రాయ్‌బరేలీ నుంచీ గెలిచారు. దీనితో వాయనాడ్‌ను వదులుకోవాల్సి వచ్చింది. ఈ స్థానానికి రాజీనామా చేశారు. ఫలితంగా ఇక్కడ ఉప ఎన్నిక అవసరమైంది.

Wayanad Lok Sabha bypoll Priyanka Gandhi Vadra files her nomination papers

నవంబర్ 13వ తేదీన ఇక్కడ పోలింగ్ షెడ్యూల్ అయింది. అదే నెల 23వ తేదీన ఫలితాలు వెల్లడి కానున్నాయి. వాయనాడ్‌, మహారాష్ట్రలోని నాందెడ్ లోక్‌సభతో పాటు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న 47 అసెంబ్లీ స్థానాలకూ అదే రోజున ఎన్నికలు జరుగుతాయి.

నామినేషన్ వేయడానికి మంగళవారం రాత్రే ప్రియాంక గాంధీ, సోనియా గాంధీ వాయనాడ్‌కు చేరుకున్నారు. ఇక్కడి రిసార్ట్‌లో బస చేశారు. ఈ ఉదయం పార్టీ నాయకులు అందజేసిన నామినేషన్ పత్రాలపై సంతకాలు చేశారు. అనంతరం కల్పెట్టలో రోడ్ షో నిర్వహించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+