వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బెంగాల్ హింస: ఇళ్లు వదిలిపోయినవారిని తిరిగితీసుకురండి: త్రిసభ్య కమిటీకి హైకోర్టు ఆదేశాలు

|
Google Oneindia TeluguNews

కోల్‌కతా: పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల తర్వాత చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలతో భయపడి తమ ఇళ్లను వదిలిపోయినవారిని తిరిగి తమ నివాసాలకు రప్పించేందుకు కలకత్తా హైకోర్టు సోవమారం ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత బెంగాల్‌లోని పలు ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే.

ఇళ్లు వదిలిపోయినవారిని తిరిగి తీసుకురండి..

ఇళ్లు వదిలిపోయినవారిని తిరిగి తీసుకురండి..


యాక్టింగ్ చీఫ్ జస్టిస్ రాజేంద్ బిందాల్ తోపాటు న్యాయమూర్తులు ఐపీ ముఖర్జీ, హరీశ్ టాండన్, సౌమెన్ సేన్, సుబ్రతా తలూక్దార్ లతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలను జారీ చేసింది. హింసాత్మక ఘటనలతో తమ తమ నివాసాలను వదిలివెళ్లిన ప్రజలను తిరిగి వారి స్వస్థలాలకు తీసుకురావడంతోపాటు తమకు పూర్తి వివరాలతో కూడిన నివేదికను సమర్పించాలని హైకోర్టు ధర్మాసనం ఆ కమిటీని ఆదేశించింది.

ప్రజలకు జీవించే హక్కుంది..

ప్రజలు తమ తమ నివాసాలకు చేరుకుని ప్రశాంతంగా జీవించేందుకు హక్కు ఉంది. లా అండ్ ఆర్డర్‌ను నిర్వహించడం ప్రభుత్వ బాధ్యత అని కోర్టు గుర్తు చేసింది. ముగ్గురు సభ్యుల కమిటీలో రాష్ట్ర మానవ హక్కుల సంఘం నుంచి ఒకరు, జాతీయ మానవ హక్కుల నుంచి ఒకరు, పశ్చిమ బెంగాల్ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రటరీ మెంబర్ సభ్యులుగా ఉంటారని హైకోర్టు స్పష్టం చేసింది. ఎవరైతే తమ నివాసాలకు వెళ్లేందుకు అనుమతించబడరో వారంతా పశ్చిమబెంగాల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ(డబ్ల్యూబీఎల్ఎస్ఏ)ను సంప్రదించాలని, వారికి మెయిల్ చేసిన స్పందిస్తారని తెలిపింది. అంతేగాక, స్థానిక పోలీసులను సంప్రదించి బాధిత ప్రజలను తమ నివాసాలకు చేర్చేందుకు కమిటీ సహకరిస్తుందని హైకోర్టు తెలిపింది.

ఎన్నికల తర్వాత హింసాత్మక ఘటనలు.. హైకోర్టు హెచ్చరిక

ఎన్నికల తర్వాత రాష్ట్రంలో చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలతో 200 మందికిపైగా ప్రజలు తమ నివాసాలను వీడి, ఇతర ప్రాంతాలకు పారిపోయారు. కొందరు అస్సాంకు వెళ్లారు. తమకు ఇప్పటికే బెదిరింపులు వస్తున్నాయని, తమ ఇంటికి ఎలా చేరుకోవాలని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో న్యాయవాది ప్రియాంక తిబ్రేవాల్ బాధితుల తరపున హైకోర్టును ఆశ్రయించారు. వాదనలు విన్న హైకోర్టు.. బాధితులకు అండగా ఉండకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారులపై కఠిన చర్యలు తప్పవని హైకోర్టు హెచ్చరించింది.

Recommended Video

Coronavirus In India: కరోనా వైరస్ పాజిటివ్ కేసుల ఉధృతిలో భారీగా తగ్గుదల !

బాధితులను పరామర్శించిన గవర్నర్ ఆవేదన..

ఇటీవల జరిగిన పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో మమతా బెనర్జీ నాయత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ(టీఎంసీ) భారీ విజయం సాధించిన అనంతరం రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు జరిగిన విషయం తెలిసిందే. పలు చోట్ల బీజేపీ కార్యాలయాలకు నిప్పుపెట్టారు. బీజేపీ ఎమ్మెల్యే, ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీ చేసినవారిపైనా దాడులు జరిగాయి. కొన్ని చోట్ల హిందువులపై దాడులు జరగడంతో వారంతా అస్సాం రాష్ట్రానికి వెళ్లిపోయినట్లు పలు వీడియోలు కూడా వెలుగుచూశాయి. టీఎంసీ గూండాలే ఈ దాడులకు తెగబడ్డారని బీజేపీ ఆరోపిస్తుండగా.. ఎలాంటి హింసాత్మక ఘటనలు జరగలేదని టీఎంసీ చెబుతోంది. ప్రధానితోపాటు బెంగాల్ గవర్నర్, కేంద్ర హోంమంత్రి కూడా ఈ హింసాత్మక ఘటనలపై తీవ్రంగా స్పందించిన విషయం తెలిసిందే.

English summary
The Calcutta High Court today ordered the formation of a three-member committee to ensure that persons displaced by post poll violence in West Bengal are able to return to their houses.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X