వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సునంద పుష్కర్‌ది హత్యే... మాకు తెలుసంటున్న బంధువులు

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: కేంద్ర మాజీ మంత్రి శశిథరూర్ భార్య సునందా పుష్కర్‌ది హత్యేనని తాము మొదటి నుంచి చెబుతున్నామని ఆమె బంధువులు అన్నారు. సునందా పుష్కర్ హత్యకు గురైనట్లు ఢిల్లీ పోలీసులు నిర్ధారించిన తర్వాత ఆమె సమీప బంధువు ఆశోక్ కుమార్ చెప్పారు.

పాఠకుల కోసం ఫేస్‌బుక్ ద్వారా ఎప్పటికప్పుడు తాజా వార్తలు... లైక్ చేయండి.

సునందను హత్య చేశారని తమ కుటుంబం మొదట నుంచి భావిస్తున్నట్లు అశోక్ కుమార్ చెప్పారు. ఐతే ఈ విషయాన్ని ఢిల్లీ పోలీసులు ఆలస్యంగా నిర్ధారించారని అన్నారు. సునంద మృత దేహాం వైద్య పరీక్షల నివేదక ఆధారంగా కేసును హత్య నేరం కిందికి మార్చారు.

We always knew it was murder, says Sunanda Pushkar's cousin

సునంద పుష్కర్ మరణించి పడి ఉన్న గదిని పోలీసులు, ఫోరెన్సిక్ నిపుణులు ఇటీవల తిరిగి సందర్శించారు. ఆమె మరణించినప్పటి నుంచి ఆ గదిని మూసేశారు. తిరిగి ఇప్పుడే తెరిచారు. ఎయిమ్స్ ఈ నెల 29వ తేదీన నివేదికలను సమర్పించింది. ఆ నివేదికల ఆధారంగా హత్యా నేరం కింద కేసు నమోదు చేసినట్లు ఢిల్లీ పోలీసు కమిషనర్ బిఎస్ బస్సీ చెప్పారు.

శశి థరూర్ మంత్రిగా ఉన్న సమయంలో.. ఢిల్లీలోని ఓ హోటల్లో 2014 జనవరి 17న సునంద అనుమానాస్పద స్థితిలో మరణించిన విషయం తెలిసిందే. ఆమె మరణానికి కారణం ఏంటన్నది అప్పట్లో పూర్తిగా నిర్ధారణ కాలేదు. ఆమెపై విష ప్రయోగం జరిగిందని మంగళవారం ఢిల్లీ పోలీసులు నిర్ధారించారు.

అంతే కాదు, ఆమెపై ప్రయోగించిన విషాన్ని 'ఎయిమ్స్' వైద్య నిపుణులు పొలొనియం అని పేర్కొన్నారు. పొలొనియంను మేడం క్యూరీ దంపతులు 1898లో కనుగొన్నారు. ఇది అత్యంత విషపూరితమైన రేడియాధార్మిక పదార్ధం. దీనిని గతంలో పాలస్తీనా అధ్యక్షుడు యాసిర్ ఆరాఫత్‌ను చంపేందుకు వినియోగించినట్లు వార్తా కథనాలు వచ్చాయి.

English summary
Sunanda Pushkar's cousin Ashok Kumar in a statement said that the family always new it was murder. "We always knew that this was a case of murder, this decision was delayed," Kumar told ANI.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X