వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉద్దవ్ ఠాక్రే ‘ఊ’అంటే రాజీనామాలే: రాందాస్ కదమ్ హెచ్చరిక

తాను, తమ పార్టీకి చెందిన మంత్రులు రాజీనామా లేఖలను జేబులో సిద్ధంగా ఉంచుకున్నామని, తమ పార్టీ అధినేత ఉద్దవ్ ఠాక్రే ఆదేశాల కోసమే ఎదురుచూస్తున్నామనిశివసేన సీనియర్ నేత, కేంద్ర మంత్రి రాందాస్ కదమ్ చెప్పారు

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

ముంబై: మిత్రపక్షాలైన బీజీపీ, శివసేన నడుమ సంబంధాలు పూర్తిగా తెగదెంపులయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వం నుంచి శివసేన బయటికి వచ్చేలా ఉంది.

తాను, తమ పార్టీకి చెందిన మంత్రులు రాజీనామా లేఖలను జేబులో సిద్ధంగా ఉంచుకున్నామని శివసేన సీనియర్ నేత, కేంద్ర మంత్రి రాందాస్ కదమ్ చెప్పారు. తమ పార్టీ అధినేత ఉద్దవ్ ఠాక్రే ఆదేశాల కోసమే ఎదురుచూస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

We are carrying resignation letters with us: Sena minister

ఉద్దవ్ ఠాక్రే తలూపిన వెంటనే రాజీనామా లేఖలను అందజేస్తామని, పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలకు ముందు ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ ఏర్పాటు చేసిన అఖిల పక్ష ఎంపీల సమావేశాన్ని శివసేన ఎంపీలు బహిష్కరిస్తున్నట్లు రాందాస్ కదమ్ వివరించారు.

అయితే, మహారాష్ట్రలో బీజీపీ ప్రభుత్వం పూర్తికాలం అధికారంలో ఉంటుందని ఆ రాష్ట్ర బీజేపీ చీఫ్ రావ్ సాహెబ్ దాన్వె ధీమా వ్యక్తం చేశారు. మహారాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల్లో
బీజేపీతో పెట్టుకోబోమని, ఒంటరిగానే పోటీ చేస్తామని శివసేన అధ్యక్షుడు ఉద్దవ్ ఠాక్రే ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఆ రాష్ట్రంలో బీజేపీ, శివసేన సంయుక్తంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. ఎన్డీఏ భాగస్వామిగా ఉన్న శివసేన... నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిన తరువాత పలు అంశాలలో బీజేపీతో విభేదిస్తోంది.

English summary
A day after the Shiv Sena decided to go solo in the Maharashtra civic polls, senior Sena leader and state minister Ramdas Kadam today said he and his colleagues in the BJP-led government are carrying resignation letters in their pockets and waiting for party chief Uddhav Thackerays directions.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X