వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాంగ్రెస్‌కు లైఫ్ అండ్ డెత్: రంగంలో దిగిన ట్రబుల్ షూటర్స్

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఎప్పుడెప్పుడా అంటూ దేశ ప్రజలు ఉత్కంఠభరితంగా ఎదురు చూస్తూ వస్తోన్న అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఇవ్వాళ వెలువడనున్నాయి. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో నిక్షిప్తమైన అభ్యర్థుల భవితవ్యం ఇంకొన్ని గంటల్లో బహిర్గతం కానుంది. ఈ అయిదింట్లో నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. బీజేపీ వాటిని నిలబెట్టుకుంటుందా? లేదా? అనేది ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

యూపీలో వార్‌ వన్‌సైడ్..

యూపీలో వార్‌ వన్‌సైడ్..

సోమవారం వెలువడిన ఎగ్జిట్ పోల్స్ వల్ల.. ఏ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనే విషయం మీద ఓ అంచనా అనేది ఏర్పడింది. ఉత్తర ప్రదేశ్‌లో మళ్లీ యోగి ఆదిత్యనాథ్ సారథ్యంలో భారతీయ జనతాపార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందంటూ అన్ని ఎగ్జిట్‌పోల్స్ స్పష్టం చేశాయి. 2017 తరహాలోనే భారీ మెజారిటీని అందుకుంటాయని అంచనా వేశాయి. పంజాబ్‌లో ఆమ్ఆద్మీ పార్టీ పాగా వేస్తుందని అంచనా వేశాయి. మణిపూర్‌లో బీజేపీ వరుసగా రెండోసారి అధికారంలోకి వస్తుందని పేర్కొన్నాయి.

గోవాలో హంగ్..

గోవాలో హంగ్..


మిగిలిన రెండు రాష్ట్రాలు- గోవా, ఉత్తరాఖండ్‌పై వెలువడిన ఎగ్జిట్ పోల్స్ ఆసక్తికరంగా మారాయి. ఈ రెండు చోట్ల కూడా హంగ్ అసెంబ్లీ ఏర్పడే అవకాశాలు లేకపోలేదంటూ ఎగ్జిట్ పోల్స్ అభిప్రాయపడ్డాయి. ఈ పరిణామాలతో అక్కడ నంబర్ గేమ్ మొదలైంది. రిసార్ట్ రాజకీయాలకు తెర లేచింది. కాంగ్రెస్ సీనియర్ నాయకులు గోవా చేరారు. కేంద్ర మాజీమంత్రి పీ చిదంబరం, కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డీకే శివకుమార్ సహా పలువురు నేతలు పనాజీ చేరుకున్నారు. మిత్రపక్షాలతో రాత్రంతా సమావేశం అయ్యారు.

 మిత్రపక్షాలకు గాలం వేస్తారనే ఆందోళన..

మిత్రపక్షాలకు గాలం వేస్తారనే ఆందోళన..

హంగ్ ఏర్పడితే తమ మిత్రపక్షాలకు చెందిన ఎమ్మెల్యేలకు బీజేపీ గాలం వేస్తుందనే ఆందోళన కాంగ్రెస్ నేతల్లో స్పష్టంగా కనిపిస్తోంది. ఇదివరకు కర్ణాటక, మధ్యప్రదేశ్‌లల్లో అర్ధాంతరంగా ప్రభుత్వాన్ని కోల్పోవాల్సి వచ్చిన పరిస్థితులను వారు గుర్తు చేస్తోన్నారు. అధికారంలోకి రావడానికి బీజేపీ నాయకులు ఎంతకైనా తెగిస్తారని, ఆపరేషన్ లోటస్ పేరుతో కోట్ల రూపాయలను గుమ్మరించడానికి సిద్ధంగా ఉన్నారంటూ కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తోన్నారు.

అసెంబ్లీ సీట్లు ఇలా..

అసెంబ్లీ సీట్లు ఇలా..

40 స్థానాలు ఉన్న గోవా అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నెలకొల్పడానికి 21 సీట్లు అవసరం అవుతాయి. బీజేపీ, కాంగ్రెస్ ఈ మేజిక్ ఫిగర్‌ను అందుకోలేవని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. ఇండియాటుడే యాక్సెస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్స్ ప్రకారం- కాంగ్రెస్ 15 నుంచి 20, బీజేపీ-14 నుంచి 18 స్థానాలు దక్కుతాయి. మహారాష్ట్రవాది గోమంతక్ పార్టీ 2 నుంచి 5 సీట్లు లభించవచ్చు. ఇతరులకు నాలుగు స్థానాలు దక్కుతాయి.

Recommended Video

Election Results 2022 Updates: UP, Punjab పై ఉత్కంఠ | Goa | Early Trends | Oneindia Telugu
 పూర్తి మెజారిటీ సాధిస్తాం..

పూర్తి మెజారిటీ సాధిస్తాం..

కాగా- తాము పూర్తి మెజారిటీని సాధిస్తామని డీకే శివకుమార్ ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. రాత్రంతా కాంగ్రెస్ నాయకులు- తమ మిత్ర పక్షాలతో సమావేశం అయ్యారు. కర్ణాటక, మధ్యప్రదేశ్ పరిస్థితులను గుర్తు చేశారు. మధ్యాహ్నానికే ఎన్నికల ఫలితాలు పూర్తిగా వెలువడతాయని, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన సంఖ్యాబలాన్ని తాము సాధిస్తామని డీకే శివకుమార్ పేర్కొన్నారు. గోవా ప్రజలు బీజేపీనీ ఛీత్కరించారని చెప్పారు.

English summary
we are confident to form our govt in Goa, says Congress leader DK Shivakumar.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X