వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నాడు శివసేన, నేడు శ్రీరామ సేన, బీజేపీకి సవాల్, మోడీ పాలన, లోక్ సభ ఎన్నికల పోటీ, ముతాలిక్!

|
Google Oneindia TeluguNews

ఉడిపి (కర్ణాటక): ప్రముఖ హిందూ సంస్థ, పబ్ ల మీద దాడులు చేశారని దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన శ్రీరామ సేన వ్యవస్థాపకుడు ప్రమోద్ ముతాలిక్ రాజకీయాల నుంచి తప్పుకుంటున్నామని ప్రకటించారు. ఇంత కాలం బీజేపీకి మద్దతు ఇచ్చిన శ్రీరామ సేన ఇప్పుడు అదే బీజేపీ నాయకులకు సవాలు విసిరింది.

తాము లోక్ సభ ఎన్నికల్లో పోటీ చెయ్యమని శ్రీరామ సేన వ్యవస్థాపకుడు ప్రమోద్ ముతాలిక్ స్పష్టం చేశారు. కర్ణాటకలోని ఉడిపిలో శ్రీరామ సేన వ్యవస్థాపకుడు ప్రమోద్ ముతాలిక్ మీడియాతో మాట్లాడారు. ప్రస్తుత రాజకీయాలలో నిజాయితీ లేదని, హిందూ సంస్థలకు మద్దతు తగ్గిపోతుందని ప్రమోద్ ముతాలిక్ విచారం వ్యక్తం చేశారు.

 We are not contesting in Loksabha election 2019 says Sri Ram Seene founder Pramod Muthalik

కర్ణాటకలో గుండాల రాజ్యం ఉందావని ప్రమోద్ ముతాలిక్ ఆరోపించారు. 2019లో జరిగే లోక్ సభ ఎన్నికల్లో ఏ పార్టీకి మద్తతు ఇవ్వాలి అనే విషయం శ్రీరామ సేన త్వరలో నిర్ణయిస్తుందని ప్రమోద్ ముతాలిక్ అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ 100కు 100 శాతం మంచి పనులు చేశారని ప్రమోద్ ముతాలిక్ కితాబు ఇచ్చారు.

ప్రధాని నరేంద్ర మోడీ చేసిన మంచి పనులను ప్రచారం చెయ్యడంలో బీజేపీ పూర్తిగా విఫలం అయ్యిందని ప్రమోద్ ముతాలిక్ ఆరోపించారు. కర్ణాటకలో మూడు పార్టీలకు వ్యతిరేకంగా కొత్త పార్టీ రావాలని ప్రమోద్ ముతాలిక్ అభిప్రాయం వ్యక్తం చేశారు.

ఒకరు చూస్తే ప్రతిపక్ష పార్టీకి చెందిన ఆడియో విడుదల చేస్తారు (ముఖ్యమంత్రి కుమారస్వామి), మరోకరు చూస్తే రేపు వీడియో విడుదల చేస్తామని అంటారు అని ప్రమోద్ ముతాలిక్ వ్యంగంగా అన్నారు. మీ దగ్గర వీడియో ఉంటే మొదటే ఎందుకు విడుదల చెయ్యలేదు ?, కోర్టుకు వెళ్లి ఎందుకు పరువు నష్టం దావా వెయ్యలేదు అంటూ బీజేపీ నాయకులను శ్రీరామ సేన వ్యవస్థాపకుడు ప్రమోద్ ముతాలిక్ సూటిగా ప్రశ్నించారు.

English summary
Karnataka: Speaking to media persons in Udupi SriRam Seene founder Pramod Muthalik cleared that he and his leaders not contesting in Loksabha election.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X