వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాహుల్ ఉన్నంతవరకు ఓకే.. బీజేపీకి ఇబ్బందేమీ లేదు:శివరాజ్

|
Google Oneindia TeluguNews

పంజాబ్ రాజకీయ పరిణామాలు మలుపులు తిరుగుతున్నాయి. ఇవాళ సాయంత్రం అమిత్ షాతో అమరీందర్ సింగ్ మీట్ అయ్యారు. సిద్దూ రాజీనామాపై వెనక్కి తగ్డడం లేదు. పంజాబ్ ఇష్యూపై బీజేపీ నేతలు రియాక్ట్ అవుతున్నారు. మరో నాలుగైదు నెలల్లో ఎన్నికలు జరగనుండగా.. రాహుల్ గాంధీ లక్ష్యంగా విమర్శలు చేస్తున్నారు. రాహుల్ ఉంటే తమకు ఇబ్బంది ఉండదని సెటైర్లు వేస్తున్నారు. తమ పార్టీకి ఇప్పట్లో వచ్చిన నష్టమేమీ లేదని చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న కొన్ని రాష్ట్రాల్లో ఇలా ఇబ్బందులు పడుతుంది. 5 నెలల్లో ఎన్నికలు ఉన్న పంజాబ్‌లో.. ఇదీ మైనస్ అయ్యే ఛాన్స్ ఉంది.

పంజాబ్‌ కాంగ్రెస్ రాజకీయ సంక్షోభంపై మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహన్ స్పందించారు. పృధ్వీపూర్ లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కాంగ్రెస్‌ పార్టీని నిండా ముంచడానికి రాహుల్ గాంధీ ఒక్కరు చాలన్నారు. పటిష్టంగా ఉన్న పంజాబ్ ప్రభుత్వానికి రాహుల్ గాంధీ చేజేతులా నాశ‌నం చేశార‌ని ఆరోపించారు. నవజ్యోత్ సింగ్ సిద్ధూ వల్ల కెప్టెన్ అమరీందర్‌ను సీఎం పదవి నుంచి తప్పించారని వివరించారు. ఇప్పుడు సిద్ధూ కూడా పలాయనం చిత్తగిస్తున్నారని కామెంట్ చేశారు. కాంగ్రెస్‌లో రాహుల్ గాంధీ ఉన్నంత‌కాలం బీజేపీ పెద్దగా శ్ర‌మించాల్సిన అవ‌స‌రం లేద‌ని సెటైర్లు వేశారు. తమ పార్టీకి వచ్చిన నష్టమేమీ లేదని చెప్పారు.

We dont have to do anything if Rahul Gandhi is there: Shivraj Chouhan

పంజాబ్ పీసీసీ చీఫ్ పదవికి సిద్ధూ మంగళవారం రాజీనామా చేసినప్పటికీ.. కాంగ్రెస్ అధిష్ఠానం వెంటనే ఆమోదించకుండా బుధవారం రాత్రి వరకూ పునరాలోచించుకునే అవకాశం ఇచ్చింది. అప్పటికీ సిద్ధూ ఒక నిర్ణయానికి రాకుంటే.. సిద్ధూ స్థానంలో పీపీసీసీ చీఫ్‌ పగ్గాలు మరొకరికి అప్పగించే అవకాశాలు ఉన్నాయి. కెప్టెన్‌ అమరీందర్ సింగ్‌కు సన్నిహితుడైన సునీల్ జాఖడ్‌కు లేదంటే లాల్ సింగ్ కు పార్టీ చీఫ్ పగ్గాలు ఇవ్వొచ్చని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అటు పంజాబ్ సీఎం చ‌ర‌ణ్ జిత్ సింగ్ చన్ని సిద్ధూ వ్య‌వ‌హారంపై స్పందించారు. సిద్ధూతో ఫోన్‌లో మాట్లాడాన‌ని వివరించారు. సమస్యపై కూర్చుని మాట్లాడుకోవడం ద్వారా అన్ని విష‌యాలూ ప‌రిష్కరించుకుందామ‌ని ప్ర‌తిపాదించానని వివరించారు.

English summary
Madhya Pradesh chief minister Shivraj Singh Chouhan said that Rahul Gandhi is sinking Congress and as long as he is there, the BJP does not have to do anything.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X