ఆర్ కే నగర్ దెబ్బ: తమిళనాడు మొత్తం కుక్కర్ గుర్తుతో పోటీ, శశికళ వర్గం చాలెంజ్!

Posted By:
Subscribe to Oneindia Telugu
100 మంది మీద వేటు వేసిన ఓపీఎస్

చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ప్రాతినిధ్యం వహించి ఆమె మరణంతో ఖాళీ అయ్యి ఇటీవల జరిగిన ఆర్ కే నగర్ ఉప ఎన్నికల్లో టీటీవీ దినకరన్ విజయం సాధించడంతో ఆయన వర్గీయులు మంచి ఊపుమీద ఉన్నారు.

ఆర్ కే నగర్ ఉప ఎన్నికల్లో టీటీవీ దినకరన్ కుక్కర్ సింబల్ తో విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇప్పుడు అదే కుక్కర్ గుర్తును శశికళ వర్గం కొత్తగా ప్రారంభించే పార్టీకి పెట్టుకుంటారని ఆమె వర్గీయులు అంటున్నారు.

We have the Tendency to win in Cooker symbol all over tamilnadu

అన్నాడీఎంకే పార్టీ మీద తిరుగుబాటు చేసి అనర్హతకు గురైన ఎమ్మెల్యే తంగ తమిళ సెల్వన్ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ తమిళనాడు మొత్తం కుక్కర్ సింబల్ తో పోటీ చేసి అధికారంలోకి వస్తామని జోస్యం చెప్పారు.

టీటీవీ దినకరన్ వర్గం తమిళనాడులో త్వరలో అధికారంలోకి వస్తోందని, అందులో ఎలాంటి సందేహం లేదని తంగ తమిళ సెల్వన్ చెప్పారు. శశికళకు ద్రోహం చేసి ఆమెను, టీటీవీ దినకరన్ అన్నాడీఎంకే పార్టీ నుంచి బహిష్కరించిన వారికి త్వరలో బుద్ది చెబుతామని పరోక్షంగా సీఎం పళనిస్వామి, పన్నీర్ సెల్వం వర్గాన్ని తంగ తమిళ సెల్వన్ హెచ్చరించారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకలల జీవిత భాగస్వామిని కనుగొనండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
We have the Tendency to win in Cooker symbol all over tamilnadu says Thanga Tamizhselvan. TTV Dhinakaran Supporter are celebrating their lead victory in RK Nagar byelection.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి