ప్రశాంత్ కిషోర్ తలపొగరు: సీఎంను 2 గంటలు వెయిట్ చేయించాడు: బయటికొస్తోన్న పచ్చి నిజాలు
పాట్నా: ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌పై విమర్శలు వెల్లువెత్తుతోన్నాయి. ఆయన వైఖరి పట్ల తీవ్ర అనుమానాలు వ్యక్తమౌతోన్నాయి. 2019 నాటి సార్వత్రిక ఎన్నికల్లో ఏపీలో వైెఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యూహకర్తగా పని చేసిన ప్రశాంత్ కిషోర్- ఇప్పుడు బిహార్ రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తోన్నారు. అక్కడ అధికారంలో ఉన్న జనతాదళ్ (యునైటెడ్)లో రీఎంట్రీ ఇవ్వడానికి ప్రయత్నిస్తోన్నారు.

జేడీయూ ఉపాధ్యక్షుడిగా..
జేడీయూ-ఆర్జేడీ అధికారంలో ఉన్నప్పుడు ప్రశాంత్ కిషోర్ పూర్తిస్థాయిలో రాజకీయాల్లో కొనసాగారు. కేబినెట్ ర్యాంక్ హోదాలో నితీష్ కుమార్ వద్ద సలహాదారుగా పని చేశారు. అనంతరం జేడీయూ జాతీయ ఉపాధ్యక్షుడిగా అపాయింట్ అయ్యారు. ఆర్జేడీతో తెగతెంపులు చేసుకుని బీజేపీతో నితీష్ కుమార్ పొత్తు పెట్టుకోవడాన్ని బాహటంగా విమర్శించారు. దీనితో ఆయనను నితీష్ కుమార్ పార్టీ నుంచి ఉద్వాసన పలికారు. ఆ తరువాత తృణమూల్ కాంగ్రెస్‌కు పొలిటికల్ స్ట్రాటజిస్ట్‌గా వ్యవహరించారు ప్రశాంత్ కిషోర్.

ఎన్డీఏ నుంచి బయటికి రావడంతో..
బిహార్‌లో ఇప్పుడు రాజకీయ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. నితీష్ కుమార్ బీజేపీకి దూరం అయ్యారు. ఎన్డీఏ నుంచి బయటికి వచ్చారు. మళ్లీ ఆర్జేడీతో చేతులు కలిపారు. ఈ నేపథ్యంలో- మరోసారి జేడీయూలో రీఎంట్రీ ఇవ్వడానికి ప్రశాంత్ కిషోర్ ప్రయత్నాలు సాగిస్తోన్నారు. ఇందులో భాగంగా నేరుగా నితీష్ కుమార్‌తో సంప్రదింపులు మొదలు పెట్టారు. నితీష్ కుమార్ చేసిన సూచనల మేరకు ప్రశాంత్ కిషోర్.. జేడీయూ చీఫ్ రాజీవ్ రంజన్ సింగ్ అలియాస్ లలన్ సింగ్‌తో న్యూఢిల్లీలో భేటీ అయ్యారు.

బిజినెస్ స్ట్రాటజీ..
క్రమశిక్షణతో ఉండాలనే నిబంధనతో తాను ప్రశాంత్ కిషోర్‌ను పార్టీలో చేర్చుకోవడానికి అంగీకరించానని రాజీవ్ రంజన్ సింగ్ చెప్పారు. దీనికోసం నితీష్ కుమార్ అపాయింట్‌మెంట్ తీసుకోవాలని సూచించినట్లు అన్నారు. ముఖ్యమంత్రి అపాయింట్‌మెంట్ తీసుకున్న తరువాత- దాన్ని తన బిజినెస్ స్ట్రాటజీకి అనుకూలంగా మార్చుకున్నాడని ఆరోపించారు. రెండు గంటల పాటు నితీష్ కుమార్ వెయిట్ చేయించాడని, ఆయనను కలవకుండా ప్రెస్ మీట్ పెట్టాడని విమర్శించారు.

జేడీయూలో చేరట్లేదంటూ..
నితీష్ కుమార్ పిలిచినా తాను జేడీయూలో చేరట్లేదంటూ విలేకరుల సమావేశంలో ప్రకటించాడని, దీన్ని బట్టి చూస్తే- ప్రశాంత్ కిషోర్ బిజినెస్ స్ట్రాటజీ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చని ధ్వజమెత్తారు. ప్రశాంత్ కిషోర్ బీజేపీ కోసం పని చేస్తోన్నాడని విమర్శించారు. బిజినెస్‌మెన్ తరహాలోనే ఆయన సర్వేలు కూడా ఉంటాయని, గుజరాతీయుల మైండ్‌సెట్‌తో పని చేస్తోన్నాడని ఆరోపించారు. ఇకపై ఆయనను పార్టీలోకి తీసుకునే ప్రసక్తే ఉండబోదని తేల్చి చెప్పారు.

సదభిప్రాయం లేదు..
నితీష్ కుమార్‌కు కూడా ప్రశాంత్ కిషోర్ పట్ల సదభిప్రాయం లేదని రాజీవ్ రంజన్ సింగ్ చెప్పారు. అలాంటి అభిప్రాయమే ఉంటే తన వద్దకు పంపించేవాడు కాదని, నేరుగా తానే ఆయనను పార్టీలోకి ఆహ్వానించేవాడని అన్నారు. జేడీయూలో చేరడానికి తనవంతు ప్రయత్నాలు ఎన్ని చేసినా ప్రశాంత్ కిషోర్‌కు ఎలాంటి ఉపయోగం ఉండబోదని స్పష్టం చేశారు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications