ఒమిక్రాన్ తలుపు తడుతోంది: దేశ ప్రజలకు సున్నితంగా వార్నింగ్ ఇచ్చిన ప్రధాని మోడీ

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన రేడియో కార్యక్రమం మన్ కీ బాత్‌ ద్వారా దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. కీలక విషయాలను ప్రస్తావించారు. ఈ సంవత్సరం ఇదే చివరి మన్ కీ బాత్ అంటూ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. కొత్త ఆశలతో 2022లో అడుగు పెట్టబోతోన్నామని పేర్కొన్నారు. కరోనా వైరస్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో మరింత అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. కరోనాపై పోరాటం ఇంకా ముగియపోలేదని హెచ్చరించారు.

కరోనాపై పోరు..

కరోనాపై పోరు..

ప్రస్తుతం దేశం అమృత్ మహోత్సవ్ కార్యక్రమాన్ని జరుపుకొంటోందని గుర్తు చేశారు. దేశంలో అనేక కొత్త అవకాశాలు వృద్ది చెందాయని చెప్పారు. ప్రాణాంతక కరోనా వైరస్‌ను నిర్మూలించడానికి వ్యాక్సిన్‌ను స్వయంగా అభివృద్ది చేసుకున్నామని పేర్కొన్నారు. కొత్తగా ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి చెందుతోందని, దీన్ని నివారించడానికి ప్రతి ఒక్కరు భాగస్వామ్యులు కావాలని చెప్పారు. మాస్కులను తప్పనిసరిగా ధరించాలని, చేతులను శుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు.

పరీక్షా పె చర్చా..

పరీక్షా పె చర్చా..

వైమానిక దళ గ్రూప్ కేప్టెన్, దివంగత వరుణ్ సింగ్ సేవలను ప్రధాని ఈ సందర్భంగా స్మరించారు. తమిళనాడులో చోటు చేసుకున్న హెలికాప్టర్ ప్రమాదంలో వరుణ్ సింగ్ కూడా కన్నుమూశారని గుర్తు చేశారు. మృత్యువుతో పోరాడారని చెప్పారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన యోధుడిగా కీర్తించారు. పరీక్షా పర్ చర్చ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నామని, ఇందులో పాల్గొనదలిచిన విద్యార్థులు, తల్లిదండ్రులు 28 నుంచి 30వ తేదీ వరకు my.gov వెబ్‌సైట్‌లో తమ పేర్లను నమోదు చేసుకోవచ్చని సూచించారు.

ఒమిక్రాన్ తలుపు తడుతోంది..

ఒమిక్రాన్ తలుపు తడుతోంది..

కొత్త వేరియంట్ ఒమిక్రాన్ దేశం ముంగిట నిలిచిందని, ఏ మాత్రం అజాగ్రత్తగా వ్యవహరించవద్దంటూ ప్రధాని సున్నితంగా హెచ్చరించారు. కరోనా, ఒమిక్రాన్‌పై తమ పోరాటాన్ని ఇంకా కొనసాగించాల్సి ఉందని గుర్తు చేశారు. కొత్త సంవత్సరం వేడుకల సమయంలో అప్రమత్తంగా ఉండక తప్పదని సూచించారు. దీన్ని నివారించడానికి కొన్ని ఆంక్షలను విధించాల్సిన వచ్చిందనే విషయాన్ని ప్రధాని గుర్తు చేశారు. పలు రాష్ట్రాలు దీన్ని అమలు చేస్తోన్నాయని పేర్కొన్నారు.

కళలు, పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలి..

కళలు, పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలి..

దేశం అనేక కళాకారులు, కళలకు పుట్టినల్లు అని ప్రధాని గుర్తు చేశారు. మారుమూల గ్రామాలు ఇప్పటికీ.. తమ సంప్రదాయబద్ధమైన కళలు, సాంస్కృతిక వ్యవహారాలను అనుసరిస్తున్నాయని చెప్పారు. గ్రామాలు, నదీతీర ప్రాంతాల్లో పర్యారణాన్ని పరిరక్షించుకోవడానికి ప్రతి ఒక్కరూ ప్రాధాన్యత ఇవ్వాలని ప్రధాని విజ్ఞప్తి చేశారు. ఎన్‌సీసీ క్యాడెట్స్ స్వచ్ఛందంగా సముద్ర, నదీ తీర ప్రాంతాలను శుభ్రం చేయడం స్వాగతించదగ్గ పరిణామమని అన్నారు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌ను స్వచ్ఛభారత్ కోసం వినియోగించుకోవాలని సూచించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+