చిన్నమ్మకు కొత్త కష్టం: ఇన్ని ములాఖత్‌లా!, తగ్గించువాల్సిందేనన్న డీజీ
వాస్తవానికి జైలు శిక్షఅనుభవిస్తున్న వ్యక్తులకు ప్రతీ ఒక 15రోజులకు ఒకసారి ములాఖత్ అవకాశం కల్పిస్తారు. అది కూడా కేవలం 15నిమిషాలకు మాత్రమే పరిమితం.
చెన్నై: జైల్లో ఉన్నా.. తమిళనాడు ప్రభుత్వాన్ని తన కనుసన్నల్లో నడిపిస్తోన్న చిన్నమ్మకు ఇకమీదట ఆ అవకాశం ఉండకపోవచ్చు. లెక్కకు మంచి, నిబంధనలను అతిక్రమించి మరీ చిన్నమ్మ చేస్తోన్న ములాఖత్ లపై జైలు అధికారులు మండిపడుతున్నారు. ఇకనుంచి ములాఖత్ లు తగ్గించుకుంటే మంచిదని ఆమెకు సలహాలు ఇస్తున్నారు.
వాస్తవానికి జైలు శిక్షఅనుభవిస్తున్న వ్యక్తులకు ప్రతీ ఒక 15రోజులకు ఒకసారి ములాఖత్ అవకాశం కల్పిస్తారు. అది కూడా కేవలం 15నిమిషాలకు మాత్రమే పరిమితం. అయితే శశికళ విషయంలో మాత్రం ఇందుకు విరుద్దంగా జరుగుతోంది. ఫిబ్రవరి 16నుంచి మార్చి 31వ తేదీ వరకు 28మందితో శశికళ ములాఖత్ అయింది. అది కూడా దాదాపు 40నిమిషాల పాటు.

అంతేకాదు, ఈ ములాఖత్ ల కోసం జైలు ఆవరణలోని ఓ ప్రత్యేక గదిని శశికళ ఉపయోగించుకుంటున్నారు. రోజురోజుకు ఆమె సందర్శానార్థం వచ్చే కార్యకర్తలు, మంత్రుల సంఖ్య ఎక్కువైపోతుండటంతో జైలు అధికారులు ఇక శశికళ వారించక తప్పలేదు. సాధారణ సందర్శకులతో పాటు మంత్రులతో ములాఖత్ లను కూడా క్రమంగా తగ్గించుకోవాలని చిన్నమ్మకు డీజీ సూచించారు.
ఆర్కేనగర్ ఎన్నికల నేపథ్యంలో చిన్నమ్మను కలవడానికి పెద్ద ఎత్తున కార్యకర్తలు, నేతలు తరలివస్తుండటంతో వారందరిని జైలు అధికారులు తిప్పి పంపించేశారు. కాగా, సీఎం పీఠం దక్కించుకోవాలని ఉవ్విళ్లూరిన అన్నాడీఎంకె తాత్కాళిక ప్రధాన కార్యదర్శి శశికళ అక్రమాస్తుల కేసులో ప్రస్తుతం పరప్పన అగ్రహార జైల్లో శిక్ష పొందుతోన్న సంగతి తెలిసిందే.












Click it and Unblock the Notifications