• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

అయోధ్య తీర్పును గౌరవిస్తాం.. కానీ ఆక్షేపించే అంశాల పట్ల సమీక్షిస్తామంటున్న ముస్లిం పర్సనల్ లా బోర్డు

|

ఢిల్లీ/హైదరాబాద్ : చారిత్య్రాత్మక అయోధ్య తీర్పులో భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. అత్యున్నత న్యాయస్థానం ఆమోదయోగ్యమైన తుది తీర్పు ఇచ్చినప్పటికి అందులో కొన్ని అంశాలు ఆక్షేపణీయంగా ఉన్నాయని ముస్లిం పర్సనల్ లా బోర్డు అభిప్రాయ పడుతోంది. న్యాయస్ధానంలో బాబ్రీ మసీదుకు సంబంధించి భూమి అని సరైన ఆధారాలు చూపించలేక పోయామని ఆయన ఆవేదన వ్యక్తం చేసారు. ముస్లిం మత పెద్దలతో, ఇతర మేధావులతో సమీక్షా సమావేశం అనంతరం తమ తుది నిర్ణయాన్ని మరోసారి వివరిస్తామని తెలిపారు. సుప్రీం ఇచ్చిన తుది తీర్పును గౌరవిస్తామని చెప్తూనే మరోసారి స్పందిస్తామని చెప్పడం కొసమెరుపు.

అయోధ్య తీర్పును గౌరవిస్తాం.. కానీ మరోసారి సమీక్షించుకొని స్పందిస్తామంటున్న ముస్లిం లా బోర్డ్..

అయోధ్య తీర్పును గౌరవిస్తాం.. కానీ మరోసారి సమీక్షించుకొని స్పందిస్తామంటున్న ముస్లిం లా బోర్డ్..

ఏళ్ల తరబడి కొనసాగిన అయోధ్య రామజన్మ భూవివాదం ఎట్ట కేలకు ఓ కొలిక్కి వచ్చింది. సుప్రీంకోర్ట్ చారిత్రక తీర్పు పట్ల కొన్ని వర్గాల్లో అసంతృప్తి రాజుకున్నట్టు తెలుస్తోంది. అయితే తీర్పు పట్ల లోతుగా విశ్లేషించుకోవాల్సిన సందర్బంలో ఎలాంటి స్పందన తెలపలేమంటున్నాయి ముస్లిం సంఘాలు. కోర్టు తీర్పు ప్రతులను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత మరో సారి స్పందిస్తామంటున్నాయి మైనారిటి సంస్ధలు. అయితే ముందస్తుగా అత్యున్నత న్యాయస్ధానం ఇచ్చిన తీర్పును మాత్రం గౌరవిస్తున్నట్టు ముస్లిం పర్సనల్ లా బోర్డు స్పష్టం చేస్తోంది

అద్వానీ, ఉమా భారతి, జోషి, ప్రవీణ్ తొగాడియా..ద వారియర్స్ ఆఫ్ రామ మందిర్: కీర్తిస్తోన్న బీజేపీ క్యాడర్

సుధీర్ఘ వాదనలు.. విచారణ.. ఎట్ట కేలకు తుది నిర్ణయం..

సుధీర్ఘ వాదనలు.. విచారణ.. ఎట్ట కేలకు తుది నిర్ణయం..

అయోధ్యలోని వివాదాస్పద భూమికి సంబంధించి 134 ఏళ్లుగా సాగుతున్న వివాదానికి తన తాజా తీర్పుతో చరమగీతం పాడేందుకు ప్రయత్నం చేసింది సుప్రీంకోర్టు. ఐదుగురు సభ్యులున్న ధర్మాసనం తాజాగా తన తీర్పును వెల్లడించింది. వివాదాస్పద భూమి రామజన్మభూమి న్యాస్ కు అప్పగిస్తూ సుప్రీం నిర్ణయం తీసుకుంది. ఈ తీర్పుపై ముస్లిం పర్సనల్ లా బోర్డు రియాక్ట్ అయ్యింది.న్యాయపరంగా ఎలాంటి అడుగు వేయాలన్న దానిపై తాము త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని చెప్పిన బోర్డు.. సుప్రీంకోర్టు తీర్పు తమకు సంతృప్తికరంగా లేదని చెప్పింది.

తీర్పు ఆమోదమే.. బాబ్రీ మసీదు ఆనవాళ్లను చూపించలేకపోయామన్న లా బోర్ట్..

తీర్పు ఆమోదమే.. బాబ్రీ మసీదు ఆనవాళ్లను చూపించలేకపోయామన్న లా బోర్ట్..

తీర్పులో తమకు ఆమోదయోగ్యం కాని అంశాలు కూడా ఉన్నాయని పేర్కొంది. ఎగ్జిక్యుటివ్ సమావేశంలో చర్చించాల్సిన విషయాలు ఉన్నట్లు చెప్పింది. 15వ శతాబ్దానికి ముందు ఆధారాలు ఉన్నాయి అంటే, 15వ శతాబ్దం తర్వాత కూడా ఆధారాలు ఉంటాయి కదా? అని ప్రశ్నించిన ముస్లిం పర్సనల్ లా బోర్డు, తదుపరి కార్యాచరణకు తాము సిద్దమవుతామని పేర్కొంది. ఈ తీర్పును తాము గౌరవిస్తున్నప్పటికీ సంతృప్తిగా మాత్రం లేమన్న మాటను బోర్డు తరపున న్యాయవాది జఫర్ యాబ్ జిలానీ వ్యాఖ్యానించారు.

సమీక్ష నిర్వహిస్తాం.. మళ్లీ ప్రతిస్పందన తెలుపుతాంమంటున్న ముస్లిం లాయర్లు..

సమీక్ష నిర్వహిస్తాం.. మళ్లీ ప్రతిస్పందన తెలుపుతాంమంటున్న ముస్లిం లాయర్లు..

తీర్పు కాపీ మొత్తం చదివిన తర్వాత రివ్యూ పిటిషన్ వేయాలో వద్దో నిర్ణయించుకుంటామని బోర్డు స్పష్టం చేసింది. ఏఎస్ఐ నివేదికలో ముస్లింలకు అనుకూలంగా ఉన్న అంశాలను కోర్టు పట్టించుకోలేదన్నారు.రివ్యూ పిటిషన్ వేసే విషయంలో కమిటీతో చర్చలు జరిపిన తర్వాతే నిర్ణయం ఉంటుందన్నారు. అంతే కాకుండా మత పెద్దల సలహా మేరకు, కోర్టు పరిధిలో చర్చకు రాని అంశాల పట్ల లోతుగా చర్చించుకుని భవిశ్యత్ కార్యచరణ దివగా అడుగులు వేస్తామని జఫర్ యాబ్ జిలానీ పేర్కొన్నారు.

English summary
The controversial land was taken over by the supreme decision to surrender to Ramjanmabhoomi Nyas. The Muslim Personal Law Board was reacting to this verdict. The board said that they will soon decide on any step of the law. The Supreme Court's verdict says they are not satisfied.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X