బొమ్మై ఫస్ట్ రియాక్షన్ ఇదే: కారును అడ్డుకున్న కార్యకర్తలు
బెంగళూరు: అత్యంత ఉత్కంఠత రేకెత్తించిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు.. కాంగ్రెస్‌కు అనుకూలంగా వెలువడుతున్నాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన పూర్తి మెజారిటీని కాంగ్రెస్ అందుకుంది. తాజా సమాచారం ప్రకారం- 124 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఆధిక్యతలో కొనసాగుతున్నారు. బీజేపీ 70 నియోజకవర్గాలకే పరిమితమైంది. జేడీఎస్ కూడా నష్టపోయింది.
#WATCH | Karnataka CM Basavaraj Bommai's convoy gets stuck in Haveri as Congress workers cheer on in the route and celebrate their party's comfortable win in #KarnatakaElections pic.twitter.com/i8nw6FAH4y
— ANI (@ANI) May 13, 2023
224 అసెంబ్లీ స్థానాలు ఉన్న కర్ణాటకలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి 113 స్థానాలు అవసరం. ఈ మార్క్‌ను అందుకుంది కాంగ్రెస్. మధ్యాహ్నానికి 124 నియోజకవర్గాల్లో ఆధిక్యతలో కొనసాగుతోంది. 70 స్థానాలకే పరిమితమైంది బీజేపీ. ఫలితాలు వెలువడుతున్న కొద్దీ ఆధిక్యత చేతులు మారుతూ వస్తోన్నప్పటికీ- కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే ఆధిక్యాన్ని కనపర్చుతోండటం ప్రాధాన్యతను సంతరించుకుంది.

హవేరీ జిల్లాలోని షిగ్గావ్ నియోజకవర్గం నుంచి ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ఘన విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్‌కు చెందిన యాసిర్ అహ్మద్ ఖాన్ పఠాన్‌ను ఓడించారు. ఈ సందర్భంగా ఆయన హవేరీలో విలేకరులతో మాట్లాడారు. ఎన్నికల ఫలితాలపై నిరాశను వ్యక్తం చేశారు. తాము ఆశించిన స్థాయిలో ఫలితాలు రాలేదని వ్యాఖ్యానించారు.
#WATCH | In spite of a lot of efforts put in by PM & BJP workers, we've not been able to make the mark. Once the full results come we'll do a detailed analysis. We take this result in our stride to come back in Lok Sabha elections: Karnataka CM Bommai#KarnatakaElectionResults pic.twitter.com/ftNLsV5HHG
— ANI (@ANI) May 13, 2023
సంపూర్ణ మెజారిటీని సాధిస్తామంటూ గతంలో తాము వేసుకున్న అంచనాలు తప్పాయని వ్యాఖ్యానించారు. దీనిపై విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. పూర్తి ఫలితాలు వెలువడిన తరువాత.. అన్ని జిల్లాల నుంచి నివేదికలను తెప్పించుకుంటామని అన్నారు.
సమన్వయ లోపం వల్లే ప్రతికూల ఫలితాలు వెలువడుతున్నాయని తాను భావిస్తోన్నానని బసవరాజ్ బొమ్మై చెప్పారు.
ఏ స్థాయిలో సమన్వయ లోపం చోటు చేసుకుందనేది ఆరా తీయాల్సి ఉందని పేర్కొన్నారు. తమది జాతీయ పార్టీ కావడం వల్ల కేంద్ర స్థాయి నుంచీ ఈ ఎన్నికల ఫలితాలపై విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. పార్టీ అభ్యర్థుల విజయానికి కృషి చేసిన ప్రతి ఒక్క బీజేపీ నాయకుడు, కార్యకర్తకు పేరు పేరునా కృతజ్ఞతలు తెలియజేస్తోన్నానని బసవరాజ్ బొమ్మై చెప్పారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మొదలుకుని చిట్టచివరి కార్యకర్త వరకు కూడా ఎంతో కృషి చేశారని, ఫలితాలు ప్రతికూలంగా రావడం నిరాశ కలిగించిందని వ్యాఖ్యానించారు. కాగా- హవేరీలో బీజేపీ కార్యకర్తలు ఆయన కారును అడ్డుకున్నారు. బొమ్మై ఘన విజయం సాధించిన నేపథ్యంలో ఆయన అభిమానులు, కార్యకర్తలు హవేరిలో సందడి చేశారు. కారులో ఉన్న బొమ్మైకి షేక్ హ్యాండ్ ఇస్తూ అభినందనలు తెలిపారు.












Click it and Unblock the Notifications