మనకు విశ్రాంతి లేదిక, తెలంగాణ-దేశం: పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపిన మల్లిఖార్జున్ ఖర్గే
హైదరాబాద్: విభేదాలు పక్కన పెట్టి.. పార్టీ విజయానికి ప్రాధాన్యం ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే పిలుపునిచ్చారు. హైదరాబాద్ వేదికగా సీడబ్ల్యూసీ సభ్యులతోపాటు అన్ని రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు, సీఎల్పీ నేతలు, పార్లమెంటు సభ్యులు, ముఖ్య నేతలతో జరుగుతున్న రెండో రోజు ఆదివారంనాటి సమావేశంలో ఆయన మాట్లాడారు.
దేశ ప్రజలంతా ప్రత్యామ్నాయం కోసం చూస్తున్నారని ఖర్గే అన్నారు. హిమాచల్‌ప్రదేశ్, కర్ణాటక ఎన్నికల్లో పార్టీ విజయానికి దీనికి స్పష్టమైన రుజువని చెప్పారు. వ్యక్తిగత ప్రయోజనాలు, విభేదాలు పక్కన పెట్టి.. పార్టీ విజయానికి ప్రాధాన్యం ఇవ్వాలని కాంగ్రెస్ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు. ఇక సంస్థాగత ఐక్యత చాలా ముఖ్యమన్నారు. ఐక్యత, క్రమశిక్షణ ద్వారా మాత్రమే ప్రత్యర్థి పార్టీలను ఓడించగలమని ఖర్గే స్పష్టం చేశారు.

ఇది విశ్రాంతి తీసుకునే సమయం కాదని కాంగ్రెస్ శ్రేణులకు నిర్దేశించారు. గత పదేళ్ల బీజేపీ పాలనలో సామాన్య ప్రజల కష్టాలు రెట్టింపయ్యాయని అన్నారు. పేదలు, రైతులు, కార్మికులు, మహిళలు, యువత సమస్యలను పరిష్కరించడంలో ప్రధాని మోడీ విఫలమయ్యారని ఆరోపించారు. ప్రధాని ఆత్మ విమర్శ చేసుకోవడం లేదన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో దేశ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేందుకు అందరూ ఏకమై ఈ నియంతృత్వ ప్రభుత్వానికి తెరదించాలని పిలుపునిచ్చారు.
A meeting of the Extended Congress Working Committee is currently underway in Hyderabad, Telangana.
— Congress (@INCIndia) September 17, 2023
The crucial meeting is being attended by all CWC members, PCC Presidents, CLP leaders, CEC members and CPP office-bearers. pic.twitter.com/FIr1fmW7NA
మహాత్మా గాంధీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికై 2024 నాటికి శతాబ్ది కాలం పూర్తి కావస్తోందని, ఈ నేపథ్యంలో అదే ఏడాది జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని అధికారం నుంచి గద్దె దించడమే మహాత్ముడికి సరైన నివాళి అని ఖర్గే చెప్పుకొచ్చారు. రానున్న సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొవాలని అన్నారు.
త్వరలో ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయని, లోక్‌సభ ఎన్నికలకు ఆరు నెలలే గడువుందని ఖర్గే చెప్పారు. జమ్మూకాశ్మీర్‌లోనూ అసెంబ్లీ ఎన్నికలకు మనం సిద్ధంగా ఉండాలన్నారు. ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్‌లలో కాంగ్రెస్ ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలను దేశ వ్యాప్తంగా ప్రచారం చేయాలన్నారు. సరికొత్త బలం, స్పష్టమైన సందేశంతో తెలంగాణ నుంచి ముందుకెళ్తామని ఖర్గే పేర్కొన్నారు. తెలంగాణతో సహా రానున్న అన్ని ఎన్నికల్లోనూ కాంగ్రెస్ గెలవాలని పార్టీ శ్రేణులకు మల్లిఖర్జున్ ఖర్గే స్పష్టం చేశారు. తెలంగాణ నుంచి కేంద్రంలో అధికారం చేపట్టేవరకు నిబద్ధతతో పనిచేయాలని పిలుపునిచ్చారు.
-
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు!












Click it and Unblock the Notifications