Weather Forecast: దేశంలోని ఆ రెండు రాష్ట్రాల్లో భారీ వర్షాలు, ఆరెంజ్ అలర్ట్ జారీ

న్యూఢిల్లీ: దేశంలోని పలు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. ఇటీవల ఢిల్లీలో వర్షాలు బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. తాజాగ,ా ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో శుక్రవారం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) తెలిపింది.

ఈ వ్యవస్థ పశ్చిమ-వాయువ్య దిశగా ట్రాక్ చేయబడుతుందని, ఆ తర్వాత 48 గంటల్లో క్రమంగా బలహీనపడుతుందని తెలిపింది. .ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలతోపాటు వాయువ్య భారతదేశంలోని చాలా ప్రాంతాల్లో శుక్రవారం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది.

Weather Forecast: Parts Of UP, Uttarakhand Under Orange Alert As Heavy Rainfall Likely

ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలకు వాతావరణ శాఖ గురువారమే ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. ఈ ప్రాంతాల ప్రజలు భారీ వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో వచ్చే రెండు మూడు రోజులు మేఘావృతమై వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఉరుములుమెరుపులతోపాటు పిడుగులుపడే అవకాశం ఉందని హెచ్చరించింది.

ఇక ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్‌లోనూ వర్షాలతోపాటు చలిగాలులు వీయనున్నాయని తెలిపింది. ఉరుములుమెరుపులు, పిడుగులు పడే అవకాశం ఉందని తెలిపింది.

Weather.com ప్రకారం.. ఇదే సమయంలో, 2021 వర్షాకాలంలో, ఉత్తరాఖండ్ (1072.8 మిమీ), ఉత్తరప్రదేశ్ (632.5 మిమీ) రెండూ జూన్ 1 నుంచి సెప్టెంబర్ 15 వరకు సంబంధిత దీర్ఘకాలిక సగటు గణాంకాలతో పోలిస్తే 'సాధారణ' వర్షపాతం పొందగలిగాయి.

ఇది ఇలావుండగా, ఢిల్లీలో గత ఆదివారం మరోసారి భారీ వర్షాలు కురిశాయి. ఢిల్లీ ఎన్సీఆర్, పంజాబ్, రాజస్థాన్ లో నేడు భారీ వర్షం పడింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఢిల్లీలో సెప్టెంబర్ 18వరకు వర్షాలు కురుస్తాయని తెలిపింది. 121 ఏళ్ల తరువాత ఢిల్లీలో శుక్ర, శనివారాల్లో రికార్డు స్థాయి వర్షపాతం నమోదు అయింది. 1975 తరువాత ఈ ఏడాది రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదు అయింది. గడిచిన నాలుగు నెలలల్లో 113.9 సెంటిమీటర్ల వర్షపాతం నమోదు అయింది. ఈ వర్షాకాలంలో కురవాల్సిన 60 శాతం వర్షపాతం 7 రోజుల్లోనే నమోదు కావడం గమనార్హం. శనివారం కురిసిన భారీ వర్షానికి ఢిల్లీ నగరంతోపాటు విమానాశ్రయం కూడా జలమయమైన విషయం తెలిసిందే. రోడ్లపై మోకళ్లలోతు వరకు నీరు నిలిచపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+