ఏపీ, తెలంగాణలో మూడు రోజులపాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు
హైదరాబాద్/అమరావతి: తెలుగు రాష్ట్రాల్లో రానున్న మూడు రోజులపాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వాయుగుండం, అల్పపీడనం కారణంగా జోరువానలు కురుస్తాయని పేర్కొంది.

తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు
తెలంగాణలో పశ్చిమ, నైరుతి వాయుగుండం ప్రభావంతో ఒకటి రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. హైదరాబాద్‌తో పాటు పరిసర ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ వర్షాలకు భౌగోళిక దృగ్విషయం ప్రధాన కారణమని హైదరాబాద్‌లోని వాతావరణ కేంద్రం డైరెక్టర్ డాక్టర్ నాగరత్న చెప్పారు.

వాయుగుండం ప్రభావంతో తెలంగాణలో వర్షాలు
ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంపై ప్రధానంగా పశ్చిమ, నైరుతి వాయుగుండం ఎక్కువగా ఉందని చెప్పారు. దీని ప్రభావంతో తెలంగాణలో రానున్న నాలుగైదు రోజుల పాటు ఒకటి లేదా రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. రాబోయే మూడు, నాలుగు రోజుల్లో ఉష్ణోగ్రతలు సాధారణ పరిస్థితుల్లో 2 డిగ్రీల సెల్సియస్ ఎక్కువ లేదా తక్కువ ఉండే అవకాశం ఉందని డాక్టర్ నాగరత్న తెలిపారు.

దక్షిణ కోస్తా, రాయలసీమలో మూడు రోజులపాటు వర్షాలు
మరోవైపు, ఆంధ్రప్రదేశ్‌లో రాగల మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఆంధ్రప్రదేశ్, యానాంలో దిగువ ట్రోపో ఆవరణలో వాయువ్య దిశగా గాలులు స్తున్నాయని, ఉత్తర కోస్తాలో బుధ, గురువారాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్నిచోట్ల కురిసే అవకాశముందని పేర్కొంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల పడే అవకాశం ఉందని తెలిపింది. ఈదురు గాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో వీస్తాయని, శుక్రవారం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశముందని వాతావరణ శాఖ పేర్కొంది. దక్షిణ కోస్తాలో బుధ, గురువారాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్నిచోట్ల కురుస్తాయని, ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉందిని పేర్కొన్నారు. రాయలసీమలో బుధ, గురు, శుక్రవారాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం అధికారులు స్పష్టం చేశారు.

ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు
ఉత్తరాంధ్ర జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. కాగా, వాయవ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం.. వాయువ్య దిశగా ఒడిశా తీరం వైపు కదులుతోందని వాతావరణ శాఖ తెలిపింది. వచ్చే 24 గంటల్లో ఇది మరింతగా బలపడే అవకాశం ఉందని వెల్లడించారు. దీని ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని, అనేకచోట్ల ఓ మోస్తరు నుంచి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని వివరించింది.












Click it and Unblock the Notifications