పెళ్లి వేడుకలో పెను విషాదం: బావిలో పడి చిన్నారులతోపాటు 13 మంది మహిళలు మృతి
లక్నో: ఎంతో సంబంరంగా, సందడిగా సాగిన పెళ్లి వేడుకలో పెను విషాదం చోటు చేసుకుంది. కూర్చున్న పైకప్పు కూలిపోవడంతో బావిలోపడి చిన్నారులతోపాటు 13 మంది మహిళలు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు గాయపడ్డారు. వివాహ వేడుకలు జరుగుతున్న ఖుషినగర్ జిల్లాలోని నెబువా నౌరంగియా ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది.
ఈ ఘటనపై కుషీనగర్ జిల్లా మేజిస్ట్రేట్ ఎస్ రాజలింగం మాట్లాడుతూ.. బావి స్లాబ్‌పై కొంతమంది కూర్చుని ఉన్నారని, అధిక లోడ్ కారణంగా అది విరిగిందని అన్నారు. ప్రమాదవశాత్తు బావిలో పడి 13 మంది చనిపోయారని, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారని మాకు తెలిసింది. ఓ వివాహ కార్యక్రమంలో కొందరు వ్యక్తులు బావి స్లాబ్‌పై కూర్చొని భారీ లోడ్ కారణంగా స్లాబ్ విరిగిపోయి ప్రమాదం జరిగింది' అని కలెక్టర్ రాజలింగం చెప్పాడు.

మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా అందజేస్తామని ఆయన తెలిపారు. ప్రస్తుతం ఈ ఘటనపై తదుపరి విచారణ కొనసాగుతోంది.
UP | 13 women have died. The incident occurred last night at around 8.30 pm in the Nebua Naurangia, Kushinagar. The incident happened during a wedding program wherein some people were sitting on a slab of a well & due to heavy load,the slab broke: Akhil Kumar, ADG, Gorakhpur Zone pic.twitter.com/VaQ8Sskjl2
— ANI UP/Uttarakhand (@ANINewsUP) February 17, 2022
మరోవైపు ఖుషీనగర్‌లో జరిగిన ప్రమాదంలో మరణించిన వారి పట్ల ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రగాఢ సంతాపం తెలిపారు. తక్షణమే సహాయక చర్యలు చేపట్టి, క్షతగాత్రులకు సరైన చికిత్స అందించాలని సంబంధిత అధికారులను యోగి ఆదిత్యనాథ్ ఆదేశించారు' అని ముఖ్యమంత్రి కార్యాలయం ట్వీట్ చేసింది.












Click it and Unblock the Notifications