పోలింగ్ నాడు అలజడికి కుట్ర: 200లకు పైగా క్రూడ్ బాంబులు: అల్లకల్లోలమే

కోల్‌కత: ఇంకొద్ది రోజులు.. పశ్చిమ బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికల తొలి దశ పోలింగ్ ఆరంభం కానుంది. ఎనిమిది విడతల్లో సాగే అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించడానికి అధికార తృణమూల్ కాంగ్రెస్.. భారతీయ జనతా పార్టీ మధ్య పోటాపోటీగా ప్రచారం సాగుతోంది. కేంద్ర ప్రభుత్వ పెద్దలందరి దృష్టీ పశ్చిమ బెంగాల్‌పైనే నిలిచింది. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సారథ్యంలోని తృణమూల్ కాంగ్రెస్‌ను ఓడించి.. అధికారాన్ని కైవసం చేసుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. తృణమూల్ కాంగ్రెస్‌కు కంచుకోటల్లాంటి నియోజకవర్గాల్లో ఆ పార్టీ నుంచి వలస వచ్చిన నేతలకు టికెట్లను ఇస్తోంది.

పోటాపోటీగా ఎన్నికల ప్రచారం సాగుతోన్న వేళ.. 200లకు పైగా క్రూడ్ బాంబులను పోలీసులు స్వాధీనం చేసుకోవడం కలకలం రేపుతోంది. ఇదివరకే పశ్చిమ బెంగాల్ మంత్రిపై క్రూడ్ బాంబుతో గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసిన నేపథ్యంలో.. ఒకేసారి ఇంత భారీ మొత్తంలో అవి లభించడం ప్రకంపలను పుట్టిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నాడు విధ్వంసం సృష్టించాలనే కారణంతోనే వాటిని తయారు చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనలో ఇప్పటిదాకా ఎవ్వరినీ అరెస్ట్ చేయలేదు. వాటిని ఎవరి కోసం తీసుకొచ్చారనే విషయంపై ఆరా తీస్తోన్నారు.

 West Bengal: 200 crude bombs were recovered from Bhangar area of South 24 Parganas

దక్షిణ 24 పరగణాస్ జిల్లాలోని భంగర్ ప్రాంతంలో ఈ క్రూడ్ బాంబులు లభించాయి. వాటిని గుర్తించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. బాంబులను స్వాధీనం చేసుకున్నారు. దర్యాప్తు చేపట్టారు. భంగర్ ప్రాంతంలో ఇప్పటికే కొందరు అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. కొందరు రౌడీషీటర్లను కూడా విచారణకు పిలిపించినట్లు సమాచారం. పోలింగ్ నాడు అల్లర్లు, దాడులకు పాల్పడటానికే వాటిని తయారు చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. కాశీపూర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ఆరంభించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+