వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పశ్చిమబెంగాల్‌లో బ్లాక్ ఫీవర్ కలకలం: 11 జిల్లాల్లో 65 కేసులు నమోదు, అలర్ట్

|
Google Oneindia TeluguNews

కోల్‌కతా: పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో కొత్త జ్వరం కలకలం సృష్టిస్తోంది. గత కొన్ని వారాల్లో.. 'కాలా అజర్' అని కూడా పిలువబడే 65 బ్లాక్ ఫీవర్ కేసులు పశ్చిమ బెంగాల్‌లోని పదకొండు జిల్లాల నుంచి, ప్రధానంగా రాష్ట్రంలోని ఉత్తర భాగంలో నమోదయ్యాయని తెలిసిందని రాష్ట్ర ఆరోగ్య శాఖకు చెందిన ఒక సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.

రాష్ట్ర-నిర్వహణ నిఘా ఫలితాలను ఉటంకిస్తూ వివరాలను పంచుకున్న అధికారి ప్రకారం.. పశ్చిమ బెంగాల్ నుంచి నల్ల జ్వరం(బ్లాక్ ఫీవర్) నిర్మూలించబడింది. అయితే ఇటీవలి సర్వే రాష్ట్రంలోని 11 జిల్లాల్లో ఈ 65 కేసులను గుర్తించడం జరిగింది. కోల్‌కతాలో ఇప్పటివరకు బ్లాక్ ఫీవర్ కేసులేవీ నమోదు కాలేదని నివేదిక పేర్కొంది.

West Bengal: 65 Cases Of Black Fever Reported From 11 Districts

కేసులను, వ్యాధి వ్యాప్తిని రాష్ట్రం నియంత్రించగలుగుతుందని సదరు అధికారి చెప్పారు.
డార్జిలింగ్, మాల్దా, ఉత్తర దినాజ్‌పూర్, దక్షిణ్ దినాజ్‌పూర్, కాలింపాంగ్ జిల్లాల్లో అత్యధిక కేసులు నమోదయ్యాయి. బీర్భూమ్, బంకురా, పురూలియా, ముర్షిదాబాద్ జిల్లాల్లో కూడా కొన్ని కేసులు నమోదయ్యాయి. ఇవి పరాన్నజీవి లీష్మానియా డోనోవాని సోకిన ఇసుక ఈగలు ద్వారా వ్యాప్తిస్తుందని వెల్లడించారు.

బీహార్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్‌లలో ఎక్కువ సమయం గడిపిన వారిలో నల్ల జ్వరం ఎక్కువగా ఉన్నట్లు గుర్తించామని ఆరోగ్య అధికారి తెలిపారు. ప్రస్తుతం మరింత నిఘాతో పరిశీలన ప్రక్రియ కొనసాగుతుందని ఆయన తెలిపారు.

రాష్ట్ర సచివాలయంలో ఒక ఉన్నత బ్యూరోక్రాట్‌ను ఉటంకిస్తూ.. వ్యాధితో బాధపడుతున్న రోగులందరికీ ఉచిత చికిత్స అందించాలని ప్రభుత్వం నిర్ణయించిందని నివేదిక పేర్కొంది.

ప్రైవేట్ లేబొరేటరీలో లేదా ఆసుపత్రిలో ఇన్ఫెక్షన్ ఉన్నట్లు గుర్తించినప్పటికీ, వెంటనే వైద్యుడు జిల్లా ఆరోగ్య అధికారి దృష్టికి తీసుకురావాలని అధికారి తెలిపారు. భోజనంతో పాటు చికిత్సకు అయ్యే అన్ని ఖర్చులను రాష్ట్ర ఆరోగ్య శాఖ భరిస్తుంది. కాగా, జిల్లా ముఖ్య ఆరోగ్య అధికారి మొత్తం ప్రక్రియను పర్యవేక్షిస్తారు.

English summary
West Bengal: 65 Cases Of Black Fever Reported From 11 Districts.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X