దీదీగిరికి అడ్డులేదిక: శాసన మండలి బిల్లుకు ఆమోదం -మోదీ-బీజేపీకి మండేలా ఏటా ‘ఖేల హోబే దివస్’
బీజేపీలో అంతర్గత సంక్షోభాన్ని కూడా ప్రత్యర్థులపై అస్త్రంగా వక్రీకరిస్తూ గోదీ మీడియా చేసిన ప్రచారం పటాపంచలైంది. ఎమ్మెల్యేగా ఓడిపోయిన మమతా బెనర్జీని టార్గెట్ చేయడానికే ఉత్తరాఖండ్ లో బీజేపీ తన ముఖ్యమంత్రిని మార్చిందనే వాదన గాలికికొట్టుకుపోయిందిప్పుడు. పశ్చిమ బెంగాల్ లో దీదీగిరి సాఫీగా కొనసాగేలా శాసన మండలి ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు మండలి పునరుద్దరణ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. బీజేపీని మరింత ఉడకిస్తూ ఇకపై ఏటేటా ఖేలా హోబే దినోత్సవాలు జరుపుతామని సీఎం ప్రకటించారు..

శాసన మండలి బిల్లు పాస్
రెండు నెలల కిందట హోరాహోరీగా జరిగిన పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బలమైన మోదీ-షా ద్వయాన్ని ఢీకొట్టి మమత నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ వరుసగా మూడోసారి అధికారాన్ని కైవసం చేసుకుంది. మొత్తం 294 సీట్లకుగానూ టీఎంసీ 211 స్థానాలు దక్కించుకోగా, బీజేపీ 74 సీట్లకే పరిమితమైంది. కానీ అనూహ్యరీతిలో నందిగ్రామ్ స్థానంలో మమతా బెనర్జీ ఓడిపోయారు. చట్టసభలో సభ్యురాలు కాకుండానే ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన దీదీ.. ఆరు నెలల్లోగా, అంటే ఈఏడాది నవంబర్‌లోగా ఎమ్మెల్యే లేదా ఎమ్మెల్సీ కావాల్సి ఉంది. దీంతో ఎప్పుడో రద్దయిన శాసన మండలిని మళ్లీ పునరుద్ధరించాలని మమత డిసైడయ్యారు. ఆ మేరకు ప్రవేశపెట్టిన బిల్లుకు మంగళవారం శాసనసభలో ఆమోదం లభించింది..

196-69తేడా, బీజేపీ వాకౌట్..
శాసన మండలి పునరుద్ధరణ బిల్లు ప్రవేశపెట్టిన సందర్భంలో అసెంబ్లీలో హైడ్రామా జరిగింది. దొడ్డి దారిన సీఎంగా కొనసాగేందుకే దీదీ మండలిని మళ్లీ తీసుకొచ్చారని, మండళ్ల ఏర్పాటుకు బీజేపీ వ్యతిరేకమని, అన్నిటికంటే ముందు నందిగ్రామ్ లో మమత ఓటమిపై అసెంబ్లీలో చర్చ జరగాలని ప్రతిపక్ష నేత సువేందు అధికారి పట్టుపట్టారు. వాదోపవాదాల మధ్యే మండలి ఏర్పాటు బిల్లు 196-69 తేడాతో ఆమోదం పొందింది. ఈ ఘట్టం తర్వాత సీఎం మమత ప్రసంగం ఉండగా దాన్ని నిరసిస్తూ బీజేపీ వాకౌట్ చేసింది. కాగా,

బెంగాల్‌లో ఏటా ఖేలా హోబే దివస్
మండలి బిల్లు ఆమోదం నేపథ్యంలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అసెంబ్లీలో ప్రసంగించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనూ శాసన మండళ్లు కొనసాగుతున్నాయని, అలాంటిది బెంగాల్ లో మాత్రమే వారు వ్యతిరేకించడం విడ్డూరంగా ఉందని మండిపడ్డారు. మండలిపై టీఎంసీ తన మేనిఫెస్టోలోనూ హామీ ఇచ్చిందని ఆమె గుర్తుచేశారు. బెంగాల్ ప్రజలు టీఎంసీని ఆశీర్వదించిన తీరు అమోఘమని, ఆ విజయానికి గుర్తుగా ప్రతి ఏటా 'ఖేలా హోబే దివస్' జరపాలని నిర్ణయించినట్లు మమత తెలిపారు. బీజేపీ జైశ్రీరాం నినాదాంతో మమతపై దాడికి దిగగా, టీఎంసీ ఖేలా హోబే(ఆట ఇంకా మిగిలే ఉంది) నినాదంతో కమలనాథుల్ని మట్టికరిపించడం తెలిసిందే.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications