పశ్చిమ బెంగాల్‌లో పొలిటికల్ వార్: అసెంబ్లీ స్పీకర్‌కు సీబీఐ, ఈడీ
కోల్‌కత: పశ్చిమ బెంగాల్‌లో వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి మమత బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వానికి రాజకీయపరమైన ఇబ్బందులు తప్పనట్టే కనిపిస్తోంది. ఎన్నికల్లో ఘన విజయాన్ని సాధించినప్పటికీ- వరుసగా కేసులను ఎదుర్కొంటోంది. కొద్దిరోజుల కిందటే మమతా బెనర్జీ మేనల్లుడు, టీఎంసీ లోక్‌సభ సభ్యుడు అభిషేక్ బెనర్జీని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు మూడోసారి సమన్లు జారీ చేశారు. బెంగాల్ బొగ్గు స్కామ్‌లో ఆయన విచారణను ఎదుర్కొన్నారు.
ఈ నెల సెప్టెంబర్ 21వ తేదీన అభిషేక్ బెనర్జీ మరోసారి విచారణకు హాజరు కావాల్సి ఉంది. ఆయన భార్యను సైతం ప్రశ్నించడానికి కూడా ఈడీ సమన్లు జారీ చేయనున్నారు. బొగ్గు కుంభకోణం దర్యాప్తు ఒకవంక కొనసాగుతుండగానే- నారదా కేస్ తెర మీదికి తీసుకొచ్చారు సీబీఐ, ఈడీ అధికారులు. ఈ కేసులో తమ విచారణను వేగవంతం చేశారు. ఇందులో భాగంగా- అసెంబ్లీ స్పీకర్ బిమన్ బెనర్జీకి కూడా సమన్లను జారీ చేశారు. ఈ నెల 22వ తేదీన విచారణకు హాజరు కావాలంటూ సూచించారు.

అసెంబ్లీ స్పీకర్‌కు సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు సమన్లను జారీ చేయడం రాజకీయంగా తీవ్ర కలకలానికి దారి తీసింది. స్పీకర్‌కు ఉన్న అధికారాలు, హక్కులను దృష్టిలో ఉంచుకుని చూస్తే- సీబీఐ, ఈడీలను ప్రయోగించడం ద్వారా కేంద్ర ప్రభుత్వం పశ్చిమ బెంగాల్ చట్టసభతో ఘర్షణ వైఖరికి దిగినట్టు కనిపిస్తోందనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. అసెంబ్లీ స్పీకర్‌కు సమన్లను జారీ చేయడానికి గల కారణం నారదా కుంభకోణం కేసులో ఆయన ప్రమేయం ఉన్నట్లు కాదని అంటున్నారు.
నారదా కేసులో ఆరోపణలను ఎదుర్కొంటోన్న శాసన సభ్యులపై ఇప్పటిదాకా చర్యలు తీసుకోకవడం వల్లే స్పీకర్‌కు సమన్లను జారీ చేసినట్లు సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు స్పష్టం చేశారు. నారదా కేసులో తాము నమోదు చేసిన ఎఫ్ఐఆర్‌లో పేర్లు ఉన్న శాసన సభ్యులపై ఎలాంటి చర్యలను తీసుకోకపోవడాన్ని ప్రశ్నించడానికే అసెంబ్లీ స్పీకర్‌కు సమన్లను జారీ చేసినట్లు వివరణ ఇస్తున్నారు. ఈ నెల 22వ తేదీన తమ కార్యాలయానికి హాజరు కావాలని కోరినట్లు చెప్పారు.
ఈ నెల 6వ తేదీన ఈడీ విచారణకు అభిషేక్ బెనర్జీ హాజరయ్యారు. ఆ సందర్భంగా ఈడీ అధికారులు ఆయనను ఎనిమిది గంటలకు పైగా విచారించారు. ఈస్టర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్‌కు చెందిన బొగ్గు గనుల్లో అనేక కోట్ల అక్రమాలు చోటుచేసుకున్నట్లు గత ఏడాది సీబీఐ కేసు నమోదు చేసింది. దాని ఆధారంగా ఈడీ కూడా మనీ ల్యాండరింగ్ కేసు పెట్టింది. ఈ కేసులో అనూప్ మాఝి అలియాస్ లాలాను ప్రధాన నిందితుడిగా పేర్కొంది ఈడీ. ఈ అక్రమాల్లో అభిషేక్ బెనర్జీ కూడా కొన్ని ఆర్థికపరమైన ప్రయోజనాలను పొందినట్లు ఈడీ చెబుతోంది.












Click it and Unblock the Notifications