US-Iran War: మళ్లీ ఇరాన్ పై వార్ - కాంగ్రెస్ కు ట్రంప్ నోటీసు..!
ఇరాన్ పై ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇజ్రాయెల్ తో కలిసి దాడులు ప్రారంభించి నాలుగు నెలల పాటు యుద్దం చేసిన ట్రంప్(Trump).. అప్పట్లో తగిలిన ఎదురుదెబ్బలతో వెనక్కి తగ్గారు. ఇరాన్ తో శాంతిమంత్రం జపించడం ప్రారంభించాపు. పదే పదే ఇరాన్ ను శాంతి ఒప్పందం చేసుకోవాలని ప్రతిపాదనలు పంపిన ట్రంప్.. చివరికి గత నెలలో ఆ మేరకు ఒప్పందం కూడా చేసుకుని కాల్పుల విరమణ చేపట్టారు. అయితే తాజాగా ఖమేనీ అంత్యక్రియల తర్వాత ఇరాన్ లో ఆగ్రహావేశాలు తలెత్తడంతో తిరిగి అమెరికాపై దాడులు మొదలయ్యాయి. దీంతో అమెరికా ప్రతిదాడులు చేస్తోంది. ఈ నేపథ్యంలో ట్రంప్ కీలక అడుగు వేశారు.
అమెరికా ప్రయోజనాల కోసం ఇరాన్ పై తిరిగి జూలై 7న సైనిక చర్య చేపట్టినట్లు అక్కడి పార్లమెంట్ (కాంగ్రెస్)కు ట్రంప్ తాజాగా సమాచారం ఇచ్చారు. ఈ మేరకు కాంగ్రెస్ కు యుద్ద అధికారాల నోటీసు పంపారు. అంటే ఈ నె 7 నుంచి రెండు నెలల పాటు ట్రంప్ చేపట్టే సైనిక చర్యకు కాంగ్రెస్ అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. లేకపోతే ట్రంప్ దాన్ని 60 రోజుల్లోగా విరమించుకోవాల్సి ఉంటుంది. దీంతో ఇరాన్ పై భారీ దాడులకే ట్రంప్ ప్లాన్ చేసినట్లు అర్దమవుతోంది.

అమెరికా ప్రజల్ని, జాతీయ భద్రత, విదేశాంగ విధాన ప్రయోజనాలను కాపాడటం తన బాధ్యతని ట్రంప్ ఈ నోటీసులో పేర్కొన్నారు. గతంలో అమెరికా ఇరాన్ పై చేపట్టిన సైనిక చర్య మే 1తో ముగిసిపోయినట్లు ట్రంప్ ప్రకటించారు. ఇప్పుడు తిరిగి మరో సైనిక చర్య ప్రారంభిస్తున్నట్లు కాంగ్రెస్ కు తెలిపారు. ఈ నేపథ్యంలో మరో 60 రోజుల ఇరాన్ వార్ ఖాయమని తేలిపోతోంది. ఈ మేరకు అంతర్జాతీయంగా చమురు ధరలపై తీవ్ర ప్రభావం పడేలా కనిపిస్తోంది. ఇందుకు భారత్ కూడా ముందస్తుగా సన్నద్ధం కావాల్సిన పరిస్ధితులు ఎదురవుతున్నాయి.














Click it and Unblock the Notifications