మమత బెనర్జీ మహిళనేనా: బీజేపి నేత వివాదాస్పద వ్యాఖ్యలు

Posted By:
Subscribe to Oneindia Telugu

మిడ్నాపూర్: పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై ఆ రాష్ట్రానికిచెందిన బీజెపీ నేత ఒకరు సంచలన వ్యాఖ్యలు చేశారు. మమత నపుంసకురాలు అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యల పట్ల టీఎంసి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.

పశ్చిమ మిడ్నాపూర్ లో ఆదివారం నాడు జరిగిన పార్టీ ప్రచార సభలో బీజేపి రాష్ట్ర ప్యానెల్ సభ్యుడు శ్యామపాద మండల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

West Bengal BJP leader Shyamapada Mondal calls Mamata Banerjee a ‘eunuch’

ముస్లింలు వారి మత సంప్రదాయాల్లో భాగంగా ఎలా చేస్తారో అలాంటి పనులనే మమత చేస్తున్నారని ఆయన ఆరోపించారు. అసలు ఆమె స్త్రీ నా, పురుషుడా అనే విషయం తమకు అర్థం కావడం లేదన్నారు.

ఆమె ఒ హిజ్రా అని తాను చెప్పగలనంటూ ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిపై తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఆగ్రహాం వ్యక్తం చేసింది. ఈ రకమైన ఆరోపణలతో పెద్ద పెద్ద తప్పులతో తమ పార్టీని బలంగా మార్చుకోవాలని బీజేపి యోచిస్తోందంటూ ఆయన మండిపడ్డారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
BJP leader is caught in controversy after having called West Bengal Chief Minister Mamata Banerjee a eunuch. Can’t understand whether Mamata Banerjee is a man or woman.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి