వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'మోడీ ఓ గబ్బర్ సింగ్, భయంతోనే నోట్ల రద్దును ప్రజలు ఆమోదించారు'

ప్రధానమంత్రి నరేంద్రమోడీపై నిప్పులు చెరిగారు పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ.పెద్ద నగదు నోట్ల రద్దు తర్వాత ప్రజల పరస్థితుల్లో మార్పులు రాలేదని ఆమె అభిప్రాయపడ్డారు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

కోల్ కతా:ప్రధానమమంత్రి నరేంద్రమోడీపై పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ ఘాటుగా విమర్శలు చేశారు. పెద్ద నోట్ల రద్దును సమర్థిస్తూ పార్లమెంట్ లో మాట్లాడిన మోదీని గబ్బర్ సింగ్ తో పోల్చుతూ ఆమె దుయ్యబట్టారు.

ఐదువందలు, వెయ్యి రూపాయాల నోట్లను రద్దును ఆమోదించేలా ప్రజలను నిర్భంధించారని ఆమె అభిప్రాయపడ్డారు. పెద్ద నగదు నోట్ల రద్దును ప్రజలు ఇష్టపూర్వకంగా అంగీకరించలేదన్నారు.భయంతో అంగీకరించేలా చేశారని ఆమె ఆరోపించారు.

బుదవారం నాడు ఆమె విధానసభలో ప్రధానమంత్రి మోడీపై తీవ్రమైన విమర్శలు చేశారు. "పిల్లలకు జోల పాడుతూ షోలే సినిమాలో బందిపోటు గబ్బర్ సింగ్ "ను చూపించి నిద్రపోయేలా చేసినట్టుగా ఉందన్నారు. దేశంలో సామాన్య జనం గబ్బర్ సింగ్ డీమోనిటైజేషన్ ను ఆమోదింపజేసేలా చేశారని ఆమె ఆరోపించారు.

 west bengal chief minister mamata banerjee allegations on prime minister modi

పెద్ద నగదు నోట్లు రద్దు చేసి ఇవాళ్టికి మూడు మాసాలు పూర్తైంది. ఆంక్షలు, బాధలు తొలగిపోలేదని ఆమె ట్వీట్ చేశారు.ప్రజలు ఆర్థిక స్వాతంత్య్రాన్ని కోల్పోయారని ఆమె ట్వీట్ చేశారు..కొందరుసంపన్న పెట్టుబడిదారులు మాత్రమే బాధపడడం లేదన్నారామె.

సామాన్యులు, మధ్యతరగతి, అణగారిన పేదవర్గాల ప్రజలు ఇంకా బాధల్లోనే ఉన్నారని ఆయన చెప్పారు.ఆర్థిక వ్యవస్థ మందగమనంలో ఉందన్నారు. దేశం తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో ఉంది. ఇంకా ఎంత కాలం ఇలా అంటూ ఆమె ట్వీట్ చేశారు.

English summary
west bengal chief minister mamata banerjee allegations on prime minister modi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X