Mamata Banerjee: అత్యవసరంగా ల్యాండ్ అయిన మమతా బెనర్జీ హెలికాప్టర్..
ప్రతికూల వాతావరణం కారణంగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ అత్యవసరంగా ల్యాండ్ కావాల్సి వచ్చింది. మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు ఉత్తర బెంగాల్‌లో మమతా బెనర్జీ ప్రయాణిస్తున్న చాపర్ అత్యవసరంగా ల్యాండ్ అయింది.
భారీ వర్షాల కారణంగా ఉత్తర బెంగాల్‌లోని సలుగరాలోని ఆర్మీ ఎయిర్ బేస్‌లో హెలికాప్టర్ అత్యవసరంగా ల్యాండింగ్ చేయాల్సి వచ్చిందని అధికారులు తెలిపారు. పంచాయితీ సమావేశం ముగిసిన తర్వాత మమతా బెనర్జీ బాగ్డోగ్రా నుంచి జల్పాయిగురికి హెలికాప్టర్ బయల్దేరారు. హెలిక్టాపర్ మళ్లీ టెకాఫ్ అవడానికి వాతావరణం సహకరించకపోవడంతో ఆమె రోడ్డు మార్గంలో కారులో వెళ్లిపోయారు.

ఈ మధ్యాహ్నం తర్వాత మమతా బెనర్జీ కోల్‌కతాకు తిరిగి చేరుకున్నారు. నైరుతి రుతుపవనాలు ఢిల్లీ, ముంబై, పశ్చిమ బెంగాల్‌తో పాటు దేశవ్యాప్తంగా విస్తరించాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) ఆదివారం తెలిపింది. దీని కారణంగా దేశంలో విస్తరంగా వానలు పడుతున్నాయని వెల్లడించింది.
నిదానంగా ప్రారంభమైన రుతుపవనాలు ఇప్పుడు మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలు, మొత్తం కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, ఈశాన్య భారతదేశం, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, బీహార్, తూర్పు ఉత్తరప్రదేశ్‌తో సహా అనేక ప్రాంతాలను కవర్ చేస్తూ వేగంగా ముందుకు వెళ్తున్నాయని పేర్కొంది. ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్‌లోని చాలా ప్రాంతాలు, హర్యానాలోని కొన్ని ప్రాంతాల్లో రుతుపవనాలు విస్తరించాయని తెలిపింది. దీని కారణంగా హిమాచల్ ప్రదేశ్‌లో వర్షాలు కురుస్తున్నట్లు వివరించింది.












Click it and Unblock the Notifications