వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మహిళ హత్య కేసులో 11 మందికి మరణ శిక్ష

|
Google Oneindia TeluguNews

కోల్‌కతా: ఓ మహిళ హత్య కేసులో పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని నదియా స్థానిక కోర్టు గురువారం సంచలన తీర్పు చెప్పింది. మహిళ హత్య కేసులో దోషులైన 11 మందికి మరణశిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది.

2014, నవంబర్ 23న కృష్ణగంజ్‌ ప్రాంతంలో అపర్ణ బాగ్ అనే గృహిణి హత్యకు గురైంది. నిందితులు బాంబులతో దాడి చేసి ఆ ప్రాంతంలని స్థలాన్ని ఆక్రమించునే ప్రయత్నం చేయగా, పలువురు గాయపడ్డారు. తీవ్రంగా గాయపడిన అపర్ణ మృతి చెందింది.

ఈ కేసులో విచారణ అనంతరం కోర్టు ఆ 11 మంది నిందితులని దోషులుగా నిర్ధారించి మరణ శిక్ష విధించింది. కాగా, దోషుల్లో ఒకరైన లంకేశ్వర్‌ ఘోష్‌ అనే రౌడీషీటర్‌కు తృణమూల్‌ పార్టీతో సంబంధాలు ఉన్నాయని ఆరోపణలు ఉన్నాయి.

West Bengal court sentences 11 to death for murder of woman for land-grabbing

భార్యను కాపాడబోయి భర్త మృతి

ఓ వ్యక్తి ప్రమాదంలో ఉన్న భార్యను కాపాడబోయి తన ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాద ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని రాయ్‌బరేలీలో చోటుచేసుకుంది. ఫరీద్‌పూర్‌ గ్రామానికి చెందిన హైదర్‌(25) అనే వ్యక్తి భార్య గుల్షన్‌, కుటుంబసభ్యులతో కలిసి మధుర జంక్షన్‌ వద్ద సంపర్క్‌ క్రాంతి ఎక్స్‌ప్రెస్‌ దిగాడు.

పట్టాలు దాటుతుండగా అదే సమయంలో మరో పక్క నుంచి పట్నా- కోటా ఎక్స్‌ప్రెస్‌ రైలు వేగంగా వచ్చింది. అది చూసి హైదర్‌ భార్య గుల్షన్‌ను పట్టాల నుంచి తప్పించబోతూ కంగారులో తానే రైలు కిందపడి మృతిచెందాడు. ఊహించని ఈ పరిణామంతో హైదర్‌ భార్య, కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.

English summary
In an unprecedented incident, a local court in West Bengal sentenced as many as 11 convicts to death on Thursday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X