• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

బెంగాల్ బెబ్బులి దీదీ , ప్రభంజనం.. కేజ్రీవాల్ ట్వీట్ , సంబరాల్లో టీఎంసీ, ఈసీ షాక్ !!

|

ఎనిమిది దశల్లో నిర్వహించిన పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై దేశవ్యాప్తంగా అందరి దృష్టి ఉంది.నివేదికల ప్రకారం, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆధిక్యంలో దూసుకుపోతున్నారు. ఆమె మ్యాజిక్ ఫిగర్ 200 ను దాటి దూసుకెళుతున్న పరిస్థితి ఉంది . ఎగ్జిట్ పోల్స్ కూడా టిఎంసి ఎన్నికల్లో విజయం సాధిస్తుందని తెలిపింది.అదే విధంగా దీదీ గెలుపు ఖాయమైంది.

మ్యాజిక్ ఫిగర్ ను దాటి దూసుకుపోయిన దీదీ

మ్యాజిక్ ఫిగర్ ను దాటి దూసుకుపోయిన దీదీ

ఎన్నికల ప్రచారంలో మమతా బెనర్జీ గాయపడినప్పటికీ ఆమె ఎప్పుడూ వెనక్కి తగ్గలేదు.ఆమె ఎన్నికల ప్రచారంలో చురుకుగా పాల్గొంది. ప్రశాంత్ కిషోర్ అంచనాల ప్రకారం మమతా బెనర్జీ బిజెపిని ఎదుర్కొన్నారు. బిజెపి డబుల్ డిజిట్ కే పరిమితం కావాల్సిన పరిస్థితి వచ్చింది. చివరగా, 200 కి పైగా సీట్లను దక్కించుకుని టిఎంసి విజయం వైపు పయనిస్తోంది. ఈ సమయంలో మమతా బెనర్జీ ని బెంగాల్ బెబ్బులి అంటూ కొనియాడుతున్నారు.

 బెంగాల్లో ప్రభంజనం సృష్టిస్తున్నారు . నిజంగా ఏమి పోరాటం : కేజ్రీవాల్ ట్వీట్

బెంగాల్లో ప్రభంజనం సృష్టిస్తున్నారు . నిజంగా ఏమి పోరాటం : కేజ్రీవాల్ ట్వీట్

ఇదే సమయంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల సమరం పై డిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు .బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ముందస్తు అభినందనలు తెలియజేశారు . కంగ్రాచులేషన్స్ మమతా దీదీ .. బెంగాల్లో ప్రభంజనం సృష్టిస్తున్నారు . నిజంగా ఏమి పోరాటం అంటూ వ్యాఖ్యానించారు. నిజంగానే మమతా బెనర్జీ బీజేపీ పై పోరాటం సాగించారు. బెంగాల్లో టి.ఎం.సి కంచుకోటను బద్దలు కొట్టారని ప్రయత్నం చేసిన బిజెపికి దీదీ పెద్ద షాక్ ఇచ్చారు .అధికార పక్షానికి దరిదాపుల్లో లేకుండా బిజెపి ప్రస్తుతం కొనసాగుతుంది.దీంతో బెంగాల్ లో మరోమారు టీఎంసీ అధికారం కొనసాగించనుంది.

 కోవిడ్ కారణంగా విజయోత్సవ వేడుకలపై బ్యాన్ , ప్రోటోకాల్స్ ఉల్లంఘించిన టీఎంసీ కార్యకర్తలు

కోవిడ్ కారణంగా విజయోత్సవ వేడుకలపై బ్యాన్ , ప్రోటోకాల్స్ ఉల్లంఘించిన టీఎంసీ కార్యకర్తలు

కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో ఫలితాలను ప్రకటించిన తరువాత వేడుకలు, విజయోత్సవ ర్యాలీలలో పాల్గొనవద్దని ఎన్నికల సంఘం ఆదేశాలు ఇచ్చినప్పటికీ, టిఎంసి మద్దతుదారులు కోవిడ్ ప్రోటోకాల్‌లను ఉల్లంఘించారు. దేశంలో పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసుల మధ్య, ఎన్నికల ఫలితాలను ప్రకటించిన తర్వాత ఎవరు విజయోత్సవ ర్యాలీ లను నిర్వహించవద్దని ఎన్నికల కమిషన్ ఆదేశించినప్పటికీ, తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు ప్రోటోకాల్స్‌ను ఉల్లంఘించారు .

టీఎంసీ కార్యకర్తలకు ఈసి షాక్.. కేసులు నమోదు

టీఎంసీ కార్యకర్తలకు ఈసి షాక్.. కేసులు నమోదు


కోల్‌కతాలోని కాలిఘాట్‌లోని పార్టీ కార్యాలయం వెలుపల ఫేస్ మాస్క్‌లు ధరించకుండా డ్యాన్స్ చేశారు . బెంగాల్ లో హోరాహోరీగా సాగిన పోరులో టీఎంసీ విజయం సాధించటం పట్ల పట్టరాని సంతోషంలో చిందులు వేశారు. కోవిడ్ ప్రోటోకాల్స్ నేపధ్యంలో నిషేధం ఉన్నా పట్టించుకోకుండా ప్రోటోకాల్‌లను ఉల్లంఘించిన వారిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేస్తామని, ఈ విషయాలను ఎన్నికల కమిషన్ అధికారులు గుర్తించారని ఈసీ తెలిపింది.

English summary
West Bengal Chief Minister Mamata Banerjee is lead in the counting and she crossed the magical mark 200. EC ordered not to conduct any celebrations on or after announcing the election results but Trinamool Congress activists violated the protocols and have seen dancing outside party office in Kalighat, Kolkata without wearing face masks. EC said that they noted the things and an FIR will be filed against those who violated the protocols.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X