west bengal elections: మమతా బెనర్జీపై రేసుగుర్రం విలన్ షాకింగ్ కామెంట్స్

వెస్ట్ బెంగాల్ అంటే మమత బెనర్జీ అడ్డా. గత ఎన్నికల్లో ఆమె విజయ బావుట ఎగురవేసి అక్కడ ఆమె తప్పితే మరో ప్రత్యామ్నాయ శక్తి ఎదగలేదు అని చాటి చెప్పారు. కానీ ఈసారి జరగబోయే ఎన్నికలు మాత్రం వార్ వాన్ సైడ్ కాదు అనే విషయం తెలియజేస్తుంది. చాప కింద నీరులా బీజేపీ బలపడుతుందా అంటే విశ్లేషకులు అవును అనే సమాధానం ఇస్తున్నారు.

గోరఖ్‌పూర్ ఎంపీ రవి కిషన్ వ్యాఖ్యల సంచలనం

బీజేపీ వర్గాలు కూడా పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో గెలుపు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం బెంగాల్ ఎన్నికలపై భారతీయ జనతా పార్టీ (BJP) సీనియర్ నాయకుడు, గోరఖ్‌పూర్ ఎంపీ రవి కిషన్ చేసిన తాజా వ్యాఖ్యలు దుమారం రేపాయి. రేసు గుర్రం విలన్ పాత్ర పోషించిన రవి కిషన్ చేసిన కామెంట్స్ అక్కడ రాజకీయ జ్వాల ను రగిల్చాయి. రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.

West Bengal Elections Mamata vs BJP Heats Up Ravi Kishan sensational comments Sparks Debate

మమతను టార్గెట్ చేసిన రేసుగుర్రం విలన్

మమత బెనర్జీ పై అనేక ఆరోపణలు ఉన్నాయి. ప్రధానంగా ఆమె తన ఓటు బ్యాంక్ కాపాడుకోవడానికి బంగ్లా చొరబాటు దారులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అనే ఆరోపణ ఆమెని ఆత్మరక్షణలో పడేసేలా చేస్తుంది. బీజేపీ ప్రధాన రాజకీయ అస్త్రం కూడా ఇదే. ఇదే విషయం పై రవి కిషన్ మాట్లాడుతూ.బెంగాలీ ప్రజలు తమ ఉనికిని కాపాడుకోవడానికి పోరాడుతున్నారని అన్నారు.

మమత కబంధ హస్తాల నుంచి విడిపించుకునే ధర్మ పోరాటం

ఈ పోరాటం ప్రధానంగా బంగ్లాదేశీ అక్రమ చొరబాటుదారుల నుండి పశ్చిమబెంగాల్ రాష్ట్రాన్ని రక్షించుకోవడం కోసమే అని ఆయన అభిప్రాయపడ్డారు.ఎలెక్షన్ క్యాంపెయిన్ లో భాగంగా రవి కిషన్ మాట్లాడుతూ " పశ్చిమ బెంగాల్‌లో ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేశారు. బెంగాలీ సోదర సోదరీమణులు మమత కబంధ హస్తాల నుంచి విడిపించుకుని.. తమ అస్తిత్వం కోసం.. తమని, తమ రాష్ట్రాన్ని కాపాడుకునే ధర్మ యుద్ధం చేస్తున్నారని రవికిషన్ వ్యాఖ్యానించారు.

మమతకు ప్రజలు గుణపాఠం చెప్తారు

అక్రమ చొరబాట్ల కారణంగా బెంగాల్ సంస్కృతి మరియు జనాభా సమతుల్యత దెబ్బతింటుందనే భయాన్ని సైతం రవి కిషన్ తన మాటల్లో వ్యక్తం చేశారు. గతంలో కంటే భిన్నంగా ఈసారి బెంగాల్ ప్రజల ఆలోచనా ధోరణి మారిందని..కచ్చితంగా ఓటు రూపంలో మమతకు ప్రజలు గుణపాఠం చెపుతారని రవి కిషన్ ధీమా వ్యక్తం చేశారు.ఇప్పుడు పశ్చిమ బెంగాల్ ప్రజల మొదటి ఛాయిస్ 'కమలం గుర్తు' (BJP) మాత్రమే అన్నారు.

బీజేపీతోనే చొరబాటుదారుల సమస్యకు శాశ్వత పరిష్కారం

సమూల మార్పు కోసం ప్రతి ఒక్కరూ బయటకు వచ్చి ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారు అని ఆయన అన్నారు.బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే చొరబాటుదారుల సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని ఆయన ఓటర్లకు భరోసా ఇచ్చారు. పశ్చిమ బెంగాల్‌లో బిజెపి ఎప్పటి నుండో లేవనెత్తుతున్న 'చొరబాటుదారుల' (Infiltration) అంశం, జాతీయ భద్రత మరియు స్థానిక ఓటర్ల మద్దతును కూడగట్టడంలో కీలక పాత్ర పోషిస్తోంది.

పశ్చిమ బెంగాల్ లో బిజెపి వ్యూహాత్మక అడుగులు

రవి కిషన్ వంటి ప్రముఖ నాయకులు ఇలాంటి ఘాటైన వ్యాఖ్యలు చేయడం ద్వారా సరిహద్దు ప్రాంతాల్లోని ఓటర్లను తమ వైపు తిప్పుకోవాలని బిజెపి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది.పశ్చిమ బెంగాల్ ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి ఓటు వేస్తారని రవి కిషన్ చేసిన వ్యాఖ్యలు, ఈసారి అక్కడ పోలింగ్ శాతం గణనీయంగా పెరిగే అవకాశం ఉందనే సంకేతాలను ఇస్తున్నాయి. ముఖ్యంగా యువత మరియు మహిళా ఓటర్లు తమ హక్కును వినియోగించుకోవడం ద్వారా రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయిస్తారని రాజకీయ విశ్లేషకులు సైతం భావిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+