వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నెరిసిన జుట్టు,మాసిన దుస్తులు,ఫుట్‌పాతే కేరాఫ్... మాజీ సీఎం సోదరి భార్య దయనీయ స్థితి...

|
Google Oneindia TeluguNews

ఆమె ఓ మాజీ ముఖ్యమంత్రి భార్యకు సోదరి... వైరాలజీలో పీహెచ్‌డీ చేసిన వ్యక్తి... ఇంగ్లీష్,బెంగాలీ భాషలు అద్భుతంగా మాట్లాడగలదు... ఇంత నేపథ్యం ఉన్న ఆ మహిళ ప్రస్తుతం ఫుట్‌పాత్‌లపైనే జీవితం గడుపుతున్నారు... ఎవరైనా ఇచ్చింది తినడం,రోడ్ల పక్కనే నిద్రపోవడం చేస్తున్నారు... అయితే ఈ పరిస్థితికి ఆమె ఏమాత్రం చింతించట్లేదు. కానీ చూసేవాళ్లకు మాత్రం... అంత నేపథ్యం ఉన్న వ్యక్తి ఎందుకిలా మారిపోయారనే సందేహం కలగకమానదు. ఆ వ్యక్తి పేరు ఇరా బసు... పశ్చిమ బెంగాల్‌కు పదేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన బుద్దదేవ్ భట్టాచార్య భార్య మీరాకు ఆమె తోడబుట్టిన సోదరి.

రిటైర్ అయినప్పటి నుంచి....

రిటైర్ అయినప్పటి నుంచి....

నార్త్ 24 పరగణాలు జిల్లా కేంద్రంలోని ఫుట్‌పాత్‌లపై... పూర్తిగా నెరిసిన జుట్టు,మాసిన దుస్తులతో,బక్కచిక్కిపోయిన స్థితిలో ఇరా బసు జీవితం గడుపుతున్నారు. వీధి వ్యాపారులు తినడానికి ఏమైనా ఇస్తే తిని.. అదే ఫుట్‌పాత్‌లపై నిద్రపోతున్నారు. గత రెండేళ్లుగా ఆమె ఇదే జీవితం గడుపుతున్నారు. ఒకప్పుడు టీచర్‌గా గౌరవప్రదమైన వృత్తిలో కొనసాగిన ఆమె ఉన్నట్టుండి ఎందుకిలా మారిపోయారో ఎవరికీ తెలియదు. స్కూల్‌లో టీచర్‌గా రిటైర్డ్ అయినప్పటి నుంచి ఆమె ఇలా ఫుట్‌పాత్‌లనే తన కేరాఫ్‌గా మార్చుకున్నారు.

లైఫ్ సైన్సెస్ టీచర్‌గా...

లైఫ్ సైన్సెస్ టీచర్‌గా...

ఇరా బసు ఉన్నత విద్యావంతురాలు. వైరాలజీలో పీహెచ్‌డీ చేశారు. ఇంగ్లీష్,బెంగాలీ భాషలు అద్భుతంగా మాట్లాడగలరు. అంతేకాదు,ఆమె రాష్ట్ర స్థాయి అథ్లెట్.టేబుల్ టెన్నిస్,క్రికెట్ వంటి ఆటలు కూడా ఆడేవారు. నార్త్ 24 పరగణాలు జిల్లాలోని ప్రియనాథ్ గర్ల్స్ హైస్కూల్‌లో ఆమె లైఫ్ సైన్సెస్ టీచర్‌గా పనిచేశారు. 1976లో ఆ స్కూల్లో టీచర్‌గా చేరిన ఇరా బసు... జూన్ 29,2009 వరకు అక్కడే పనిచేసి రిటైర్డ్ అయ్యారు. మధ్యలో చాలా స్కూళ్లు ఆమెకు జాబ్ ఆఫర్ చేసినా అదే స్కూల్లో ఉండిపోయారు.

పెన్షన్ కూడా లేదు...

పెన్షన్ కూడా లేదు...

టీచర్‌గా పనిచేస్తున్న సమయంలో బారానగర్‌లో కొన్నేళ్లు,లిచు బగన్ ప్రాంతంలో కొన్నేళ్లు ఉన్నారు. రిటైర్మెంట్ తర్వాత లిచు బగన్ ప్రాంతంలోని ఇంటిని ఖాళీ చేశారు. ఆ విషయం ఆమె ఎవరితోనూ చెప్పలేదు.అప్పటినుంచి నార్త్ పరగణాలు లోని దున్లప్ ప్రాంతంలోని ఫుట్‌పాత్‌లపైనే ఆమె గడుపుతున్నారు. టీచర్‌గా రిటైర్ అయ్యాక.. ఇరా బసుకు పెన్షన్ అందించేందుకు సంబంధిత పత్రాలు సమర్పించాల్సిందిగా ఆమెను కోరినట్లు ప్రియనాథ్ స్కూల్ అధికారి కృష్ణకాళి తెలిపారు. అయితే ఇరా బసు ఆ డాక్యుమెంట్స్ సమర్పించలేదని... దాంతో ఆమెకు పెన్షన్ కూడా రావట్లేదని అన్నారు.

Recommended Video

Shoaib Akthar Missing India, Waiting for the betterment of indo pak relations.
వీఐపీ ఐడెంటిటీ అక్కర్లేదు : ఇరా బసు

వీఐపీ ఐడెంటిటీ అక్కర్లేదు : ఇరా బసు

ఇటీవల ఉపాధ్యాయ దినోత్సవమైన సెప్టెంబర్ 5న ఓ సంస్థ ఆమెకు సన్మానం చేసింది. పూల మాలతో సత్కరించి స్వీట్లు ఇచ్చింది. ఈ సందర్భంగా ఇరా బసు మాట్లాడుతూ... ఇప్పటికీ ఎంతోమంది టీచర్లు,విద్యార్థులు తనను ప్రేమిస్తారని అన్నారు. కొంతమంది తననిలా చూసి... ప్రేమతో హత్తుకుని కన్నీళ్లు పెట్టుకుంటారని చెప్పారు. తన సోదరి భర్త ముఖ్యమంత్రిగా పనిచేసినప్పటికీ... దాన్ని తానెప్పుడూ వాడుకోవాలనుకోలేదని తెలిపారు.

కెరీర్‌లో సొంతంగానే నిలబడి రాణించానని... తనకు వీఐపీ ఐడెంటిటీ అక్కర్లేదఅని అన్నారు. ఇరా బసు ఇలా ఫుట్‌పాత్‌లపై గడుపుతున్నారనే విషయం ఉన్నతాధికారులకు తెలియడంతో ఆమెను అక్కడి నుంచి తరలించారు. ఓ అంబులెన్సును పంపించి ఆమెను ఆస్పత్రిలో చేర్చారు. ప్రస్తుతం ఆమెకు వైద్య సాయం అందుతోంది.టీచింగ్ పట్ల,ఎడ్యుకేషన్ పట్ల ఇప్పటికీ ఇరా బసుకి కొన్ని బలమైన అభిప్రాయాలు,ఆలోచనలు ఉన్నాయి. ఆన్‌లైన్ క్లాసులను తాను సపోర్ట్ చేయనని... ఈ విధానంలో విద్యార్థులు ఏమీ నేర్చుకోలేకపోతున్నారని ఆమె అంటారు.

English summary
Ira Basu,sister in law of former Chief Minister Buddhadeb Bhattacharya is now living on footpaths in North 24 Paraganas.After retiring as school teacher she shifted to footpath,nobody knows the reason for her life style.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X