Video: పోలింగ్ బూత్ లోనే చితకబాదారు, పరిగెత్తించి కొట్టిన కార్యకర్తలు

పశ్చిమ బెంగాల్‌లో మొదటి విడత పోలింగ్ అంటేనే అగ్నిపరీక్ష. ఊహించినట్టుగానే 152 నియోజకవర్గాల్లో మొదలైన ఓటింగ్ ప్రక్రియలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ముఖ్యంగా దక్షిణ దినాజ్‌పూర్ జిల్లా కుమార్‌గంజ్‌లో చోటుచేసుకున్న పరిణామాలు రాష్ట్రంలో ఎన్నికల వేడిని పతాక స్థాయికి తీసుకెళ్లాయి.

పోలింగ్ సరళిని పరిశీలించేందుకు కుమార్‌గంజ్ బీజేపీ అభ్యర్థి సుబేందు సర్కార్ ఒక కేంద్రానికి చేరుకోగా, అక్కడ ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది. తృణమూల్ కాంగ్రెస్ (TMC) కార్యకర్తలు ఆయన్ను చుట్టుముట్టి నినాదాలు చేశారు. వాగ్వాదం కాస్తా భౌతిక దాడిగా మారింది. ఆగ్రహంతో ఊగిపోయిన కొందరు వ్యక్తులు సుబేందు ముఖంపై పిడిగుద్దులు కురిపించారు. పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేసినా ఆగని దాడితో, ప్రాణాలను కాపాడుకునేందుకు అభ్యర్థి రోడ్డు వదిలి పొలాల్లోకి పరుగులు తీయాల్సి వచ్చింది. ఈ దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

West Bengal Poll Violence BJP Candidate Subhendu Sarkar Attacked Forced to Flee Into Fields in Kumarganj

పోలీసుల పహారా.. ఉత్కంఠ మధ్య ఓటింగ్..

అభ్యర్థిపై దాడి జరిగిన వెంటనే భద్రతా బలగాలు రంగంలోకి దిగి ఆయన్ను సురక్షిత ప్రాంతానికి తరలించాయి. అదనపు బలగాలను మోహరించి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనపై ఎన్నికల అధికారులు దర్యాప్తుకు ఆదేశించారు. వీడియో ఫుటేజీ ఆధారంగా నిందితులను గుర్తించే పనిలో పోలీసులు ఉన్నారు. కొన్ని ప్రాంతాల్లో ఘర్షణలు మినహాయిస్తే, మిగిలిన చోట్ల ఓటింగ్ ప్రశాంతంగానే సాగుతోందని అధికారులు ప్రకటించారు.

దూసుకుపోతున్న ఓటర్లు: రికార్డు స్థాయిలో టర్నౌట్!

అక్కడక్కడా గొడవలు జరుగుతున్నా, బెంగాలీ ఓటర్లు మాత్రం పోలింగ్ కేంద్రాలకు భారీగా తరలివస్తున్నారు.

  • పశ్చిమ మేదినీపూర్: 65.77%
  • ఝార్గ్రామ్: 65.31%
  • బాంకురా: 64.58%
  • మాల్దా: 58.45% (అత్యల్పం)

మమత వర్సెస్ మోదీ: చావో రేవో తేల్చుకునే పోరు!

నాలుగోసారి అధికారం దక్కించుకోవాలని మమతా బెనర్జీ దీక్షబూనగా, గత ఎన్నికల్లో 77 సీట్లతో సత్తా చాటిన బీజేపీ ఈసారి ఎలాగైనా 'సోనార్ బంగ్లా' నిర్మించాలని పట్టుదలతో ఉంది. మొత్తం 294 స్థానాలకు గాను తొలి విడతలోనే 152 సీట్లకు పోలింగ్ జరుగుతుండటంతో, గెలుపు గుర్రాలెవరనేది ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆసక్తి కలిగిస్తోంది. 1,478 మంది అభ్యర్థుల భవిష్యత్తు నేడు ఈవీఎంలలో నిక్షిప్తం కానుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+