వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బీజేపీ చందనా బౌరి విజయం: సామాన్య మహిళ, రోజుకులీ భార్య గెలుపంటూ సోషల్ మీడియాలో ప్రశంసలు

|
Google Oneindia TeluguNews

కోల్‌కతా: పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో సంచలనాలు చోటు చేసుకున్నాయి. 200కుపైగా అసెంబ్లీ స్థానాలను అధికార టీఎంసీ కైవసం చేసుకున్నప్పటికీ.. ఆ పార్టీ అధినేత, సీఎం మమతా బెనర్జీ మాత్రం నందిగ్రాంలో బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి చేతిలో ఘోర పరాజయం పాలయ్యారు. ఇక పలువురు బీజేపీ సిట్టింగ్ ఎంపీలు కూడా ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీ చేసి ఓటమిచవిచూశారు.

రోజుకూలీ భార్య చందనా బౌరి విజయం

అయితే, ఎలాంటి అంచనాలు లేకుండా అసెంబ్లీ బరిలోకి దిగిన బీజేపీ సల్తోరా అభ్యర్థి చందనా బౌరి మాత్రం ఊహించని విజయం సాధించారు. ఆమె.. ఓ రోజుకూలీ భార్య కావడం గమనార్హం. ఆమె టీఎంసీ అభ్యర్థి సంతోష్ కుమార్ మండల్‌పై 4వేల ఓట్ల మెజార్టీతో గెలిచి సంచలనం సృష్టించారు. దీంతో చందనా బౌరికి సోషల్ మీడియాలో అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

చందనా బౌరి ఆస్తులివే.. 30వేలు, గుడిసె..

కాగా, ఎన్నికల అఫిడవిట్‌లో చందనా బౌరి ఆస్తుల వివరాలు కూడా అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. తన ఆస్తి విలువ కేవలం రూ. 31,985 అని తెలిపింది. తనకు ముగ్గురు పిల్లలని, తన భర్త ఆస్తి రూ. 30,311 అని పేర్కొంది. చందనా బౌరి దంపతులు ఓ గుడిసెలో నివసిస్తున్నారు. వారికి మూడు మేకలు, మూడు ఆవులు ఉన్నాయి. ఈ మేరకు తన ఎన్నికల అఫిడవిట్లో చందన పేర్కొన్నారు.

చందనా బౌరికి బీజేపీ టికెట్ ఇవ్వడంతో... సామాన్య మహిళ

తనకు పార్టీ టికెట్ వస్తుందని, అసెంబ్లీ ఎన్నికల అభ్యర్తిగా పోటీ చేస్తానని ఎప్పుడూ అనుకోలేదని చందనా బౌరి తెలిపారు. అయితే, తనను చాలా మంది పార్టీ నేతలు, ప్రజలు పోటీ చేయాలని ప్రోత్సహించారని చెప్పారు. దీంతో తాను నామినేషన్ వేసినట్లు గతంలో ఆమె మీడియాకు తెలిపారు. కాగా, ఇప్పుడు ఆమె ఈ విజయం నమోదు చేయడంతో చందనాకు ట్విట్టర్‌లో పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోంది. రాజకీయాలకు సంబంధం లేని ఓ సామాన్య మహిళ విజయం అంటూ చందనా బౌరిపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

రోజుకూలీ భార్య గెలుపంటూ సోషల్ మీడియాలో ప్రశంసలు

పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని సల్తోరా నియోజకవర్గంలో ఓ రోజుకూలి భార్య అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. ఆమెకు మా శుభాకాంక్షలు అంటూ నెటిజన్లు ట్విట్టర్ వేదికగా మద్దతు తెలుపుతున్నారు. కాగా, బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో మమతా బె బెనర్జీ ఓడిపోయినప్పటికీ 200కుపైగా స్థానాల్లో విజయం సాధించింది. ఇక బీజేపీ 70 స్థానాలకుపైగా కైవసం చేసుకుంది. గత ఎన్నికల్లో బీజేపీ కేవలం 3 సీట్లలోనే విజయం సాధించడం గమనార్హం.

English summary
West Bengal results: BJP's Chandana Bauri, Wife Of Daily Wage Labourer, Wins Saltora
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X