రూ. వేల కోట్ల శారదా కుంభకోణం: రాజీనామా
కోల్‌కతా: దేశాన్ని కుదిపేసిన శారదా కుంభకోణం కేసులో నిందితుడు, పశ్చిమ బెంగాల్ రవాణా శాఖ మంత్రి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మదన్ మిత్రా ఎట్టకేలకు తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. పశ్చిమ బెంగాల్ లో ఇప్పడు ఈ విషయంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నది.
శారదా కుంభకోణం కేసులో అరెస్టు అయిన మదన్ మిత్రా ప్రస్తుతం బెయిల్ మీద బయటకు వచ్చారు. ఇదే సమయంలో మదన్ మిత్రాకు కింది కోర్టు ఇచ్చిన బెయిల్ రద్దు చెయ్యాలని సీబీఐ అధికారులు సుప్రీం కోర్టును ఆశ్రయించారు.

బెయిల్ గడువు ఒకే రోజు ఉండటం, ఒక్క సారిగా మదన్ మిత్రా తన మంత్రి పదవికి రాజీనామా చెయ్యడంతో పార్టీ నాయకులు షాక్ కు గురైనారు. గత సంవత్సరం నుంచి మదన్ మిత్రా శారదా కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కోంటున్నారు.
గత డిసెంబర్ నెలలో మదన్ మిత్రాను సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. అప్పటి నుంచి కొన్ని రోజులు మాత్రమే జైల్లో ఉన్న మదన్ మిత్రా అనారోగ్యం అంటూ ఆసుపత్రిలో వీఐపీలకు అందించే చికిత్స పొందుతూ కాలం వెల్లదీశారు. ఇప్పుడు పార్టీ అధినాయకత్వం ఆదేశాల మేరకు ఆయన రాజీనామా చేశారని తెలిసింది.












Click it and Unblock the Notifications